కట్‌రీనా | new fashion show to Katrina Kaif | Sakshi
Sakshi News home page

కట్‌రీనా

Dec 28 2017 11:43 PM | Updated on Dec 30 2017 7:41 PM

new fashion show to Katrina Kaif - Sakshi

కత్తెరతో కట్‌ చేసి 
కాస్ట్యూమ్‌ కుట్టి తొడిగితే... 
కత్తికి దుస్తులేసినట్టుంటుంది 
‘కత్తి’రీనా!
అందుకేనేమో అందరూ ఆమెను 
కత్తిలా ఉంటుందంటారు! 
మేం ఒప్పుకోం. 
కత్తెరతో కట్‌ చేసినట్లుగా ఉంటుంది కత్రినా!

►డ్రెస్సింగ్‌లో టాప్‌ అండ్‌ బాటమ్‌ బ్లాక్‌ డ్రెస్‌ ఎప్పుడూ పవర్‌ఫుల్‌ గానూ, కాన్ఫిడెంట్‌గానూ కనిపిస్తుంది. బ్లాక్‌ స్కర్ట్‌ మీదకు అదే రంగు టీ షర్ట్‌ ధరించడం వల్ల లుక్‌ ఆకర్షణీయంగా మారింది.

► బ్రౌన్‌ కలర్‌ లెహంగా మీద మల్టీకలర్‌ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ గ్రాండ్‌గా మారింది. లెహంగా కలర్‌ నెటెడ్‌ దుపట్టా, చాక్లెట్‌ కలర్‌ ప్లెయిన్‌ బ్లౌజ్‌ జత చేయడంతో వేడుకలో క్లాస్‌ లుక్‌ వచ్చేసింది. 

►ప్రింటెడ్‌ జార్జెట్‌ మెటీరియల్‌తో రూపుదిద్దుకున్న లాంగ్‌ స్లీవ్స్, ఫ్లోర్‌ లెంగ్త్‌ గౌన్‌ ఇది. పాశ్చాత్య వేడుకలకు, క్యాజువల్‌ మీటింగ్స్‌లో ఈ స్టైల్‌ అట్రాక్ట్‌ చేస్తుంది. ఓపెన్‌ స్లీవ్స్, లేస్‌ డిజైన్‌ మరింత ఆకర్షణీయంగా మారింది.

►ప్యాచ్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో తీర్చిదిద్దిన లాంగ్‌ స్కర్ట్‌ సంప్రదాయాన్ని చూపుతుంది. డిజైనర్‌ బ్లౌజ్‌ స్టైల్‌ని వైబ్రెంట్‌గా మార్చింది. టాప్, బాటమ్‌లలో ఇలా ఏదో ఒక వెస్ట్రన్‌ టచ్‌ జత చేస్తే పార్టీలో హైలైట్‌ అవ్వాల్సిందే!

►ఇది మల్టీకలర్‌ సింగిల్‌ పీస్‌ మ్యాక్సీ డ్రెస్‌. కింది భాగం హెచ్చుతగ్గులుగా, ఎక్కువ ఫ్రిల్స్‌గా రావడంతో ఈ డ్రెస్‌ ఆకట్టుకునేలా మారింది. సింపుల్‌ గెట్‌ టుగెదర్స్‌కి స్టైలిష్‌ డ్రెస్‌గా కితాబులను అందజేస్తుంది.

►ప్లెయిన్‌ రెడ్‌ జార్జెట్‌ శారీకి అంచు, పల్లూను గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేశారు. అక్కడక్కడా జరీబుటీను జత చేశారు. అంచు రంగు బెనారస్‌ బ్లౌజ్‌ను ధరించడంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది.

►మోకాలికి మీదుగా ఉండే ఈ వైట్‌ ఫ్రాక్‌ను భుజం మీదుగా అమర్చిన ఫ్లవర్‌ డిజైన్, బాటమ్‌ అంచులలో ఉండే వ్యత్యాసం అందంగా మార్చింది. పాశ్చాత్య పార్టీలకు ఈ తరహా డ్రెస్సింగ్‌ బాగా నప్పుతుంది.

భార్గవి కూనమ్‌
డిజైనర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement