కేన్సర్‌కు నానో వైద్యం...

Nano medicine for cancer - Sakshi

కీమోథెరపీ వంటి సంప్రదాయ చికిత్సలకూ లొంగని కేన్సర్లను నానోవైద్యంతో అదుపులోకి తేవచ్చునని అంటున్నారు వేన్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఆక్సిజన్‌ సరఫరా తగ్గినా, పెరుగుదలను ప్రోత్సహించే కణాలు చేరినా కేన్సర్‌ కణితులు కీమోథెరపీకి ప్రతిస్పందించవని ఇప్పటికే గుర్తించారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని నానోకణాలను ప్రయోగిస్తే మాత్రం భిన్నమైన ఫలితాలు వస్తాయని అరుణ్‌ అయ్యర్, సమరేశ్‌ సాహులతో కూడిన శాస్త్రవేత్తల బృందం నిరూపించింది. 

నానోకణాలు నేరుగా ఆక్సిజన్‌ తక్కువగా ఉన్న కణాలను, కణితి పెరుగుదలకు కారణమవుతున్న రోగ నిరోధక వ్యవస్థ కణాలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయని, అంతేకాకుండా సాధారణ పరిస్థితుల్లో కేన్సర్‌ కణితులను నాశనం చేసే రోగ నిరోధక వ్యవస్థ కణాలను ప్రోత్సహిస్తాయని అరుణ్‌ వివరించారు. అంతేకాకుండా నానో కణాలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కణితిని గుర్తిస్తాయని, కణితి గుర్తింపు, దశ నిర్ధారణ, శస్త్రచికిత్స ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం వంటి అంశాలన్నింటికీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పైగా నానో కణాలను జోడించడం వల్ల కీమోథెరపి మరింత సమర్థంగా, తక్కువ దుష్ఫలితాలతో పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం తాము రీనల్‌ సెల్‌ కార్సినోమాకు సంబంధించి కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ ఇతర కేన్సర్ల విషయంలోనూ ఈ పద్ధతి సమర్థంగా పనిచేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top