అమ్మ పాలు... ఎంతో మేలు

Mother Milk Celebrations Starts From Today - Sakshi

నేటి నుంచి తల్లి పాల వారోత్సవాలు

తల్లిపాలలో ఎన్నో రకాలు పోషకాలు, యాంటీబాడీస్, పెరుగుదలకు దోహదపడే సంక్లిష్ట అంశాలు ఎన్నో ఉంటాయి. బిడ్డ పెరుగుదలకు దోహదపడే ఈ అంశాలన్నీ తల్లిపాలలో ఉంటాయి. వాటి గొప్పదనాన్ని వివరించాలంటే మాటలూ సరిపోవు. నేటి (ఆగష్టు 1) నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల్లో సందర్భంగా తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించుకోడానికే ఈ కథనం.

మిగతా వారితో పోలిస్తే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. శారీరకంగానూ, మానసికంగానూ బాగా ఆరోగ్యంగా ఎదుగుతారు. రోగాలను సమర్థంగా ఎదుర్కొంటారు. తల్లిపాలుతాగితే... ఆ రోగనిరోధక శక్తి వారికి సహజంగానే సమకూరుతుంది.  తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉన్నాయి. వాటన్నింటినీ కృత్రిమంగా తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. అందుకే కృత్రిమంగా తయారుచేసే ఫార్ములా పాలేవీ తల్లిపాల దరిదాపుల్లోకి కూడా రాలేవు.

తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు
తల్లిపాలతో అటు బిడ్డకూ, ఇటు తల్లికీ, మరోవైపు సమాజానికీ... ఇలా ఎన్నోరకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు. తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా

రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి...
జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. కానీ ఫార్ములా పాలు/పోతపాలతో జీర్ణకోశ ఇబ్బందులొస్తాయి.
ఆస్తమా: తల్లిపాలు బిడ్డకు సరిపడకపోవడం అంటూ ఉండదు. కానీ పోతపాలుగా ఇచ్చే యానిమల్‌ మిల్క్‌ చాలావరకు బిడ్డకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
∙బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ ∙పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పోతపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ∙చిన్నప్పుడు వచ్చే (ఛైల్డ్‌హుడ్‌) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ∙నెక్రొటైజింగ్‌ ఎంటెరోకొలైటిస్‌ వంటి వ్యాధులకు అవకాశాలూ తక్కువే.

తల్లికీ చేస్తాయి మేలు: బిడ్డకు పాలు పడుతుండటం వల్ల తల్లికి కలిగే ప్రయోజనాల్లో కొన్ని...
∙పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్‌ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని తగ్గిస్తుంది ∙పాలిచ్చే తల్లుల బరువు స్వాభావికంగా తగ్గుతుంది. దాంతో బరువు రిస్క్‌ ఫ్యాక్టర్‌గా గల అనేక జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది ∙అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది ∙డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు తక్కువ ∙ఆస్టియోపోరోసిస్‌ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు తక్కువ.-డాక్టర్‌  భావన కాసుఅబ్‌స్ట్రిటీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌బర్త్‌ రైట్‌ బై రెయిన్‌బో, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top