మిస్ పర్‌ఫెక్ట్ | Miss Perfect | Sakshi
Sakshi News home page

మిస్ పర్‌ఫెక్ట్

Jan 3 2016 10:48 PM | Updated on Sep 3 2017 3:01 PM

మిస్ పర్‌ఫెక్ట్

మిస్ పర్‌ఫెక్ట్

ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఒక పెద్ద పని.

లవ్‌లీ

ప్రేమించిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఒక పెద్ద పని. పాశ్చాత్యుల్లో ప్రపోజ్ చేయడం ఎంత వెరైటీగా ఉంటే అమ్మాయి అంత మెచ్చుకుంటుంది. అందుకే అమెరికాలోని కెంటకీకి చెందిన విలియమ్స్ జీజే జెరార్డ్ తన గర్ల్ ఫ్రెండ్ జెనా ఎలాంగ్‌కు వినూత్నంగా పెళ్లి ప్రతిపాదన ఎలా చేయాలని తెగ ఆరాటపడ్డాడు. ‘లవ్ యాక్చువల్లీ’ అనే హాలీవుడ్ సినిమాలోని ఒక సీన్‌లో హీరోయిన్‌కి యూనివర్సిటీలోని బ్రాస్ బాండ్‌తో స్వాగతం పలికి, వేలాది మంది క్లాప్స్ కొడుతుండగా, తన ప్రేమ సందేశాలను ఒక్కొక్కటిగా ప్లకార్డుల రూపంలో చూపిస్తాడు హీరో.

ఆమె దానికి ఇంప్రెస్ అయి ఫ్లాటైపోతుంది. మన విలియం జెరార్డ్ కూడా కెంటకీ విశ్వవిద్యాలయం స్టూడెంట్లతో అదే సీన్ రిపీట్ చేశాడు. జెనా అనే తన గర్ల్ ఫ్రెండ్‌కు ఇలాగే స్వాగతం పలికి, మ్యూజిక్ మోగించి, ప్లకార్డు సందేశాలు చూపించాడు. చివరి ప్లకార్డు ‘యూ ఆర్ పర్ ఫెక్ట్ ఫర్ మీ’. అప్పటివరకు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయిన జెనా ఒక్కసారిగా ముందుకు వచ్చి విలియమ్స్ పెళ్లి ప్రతిపాదన అంగీకరిస్తూ నుదిటిపై ముద్దు పెట్టుకుంది. (అచ్చు ‘లవ్ యాక్చువల్లీ’ సినిమాలో లాగానే).

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement