అందగాడే నిండు చందురూడే! | Mandira Bedi in saahoo movie | Sakshi
Sakshi News home page

అందగాడే నిండు చందురూడే!

Nov 26 2017 12:00 AM | Updated on Nov 26 2017 12:00 AM

Mandira Bedi in saahoo movie - Sakshi

ప్రభాస్‌ను మందిరా బేడీ ఓ... పొగిడేస్తోంది! అట్లా ఇట్లా కాదు. ఓ లెవల్లో మొత్తం బాలీవుడ్‌ని జల్లెడేసి పట్టినా ప్రభాసంతటోడు లేడనేసింది. మందిర అన్నదని కాదు కానీ, ప్రభాస్‌కి ‘బాహుబలి’ భలే కలిసొచ్చింది. అప్పటి దాకా మనోడి హైట్‌ సదరన్‌ పీక్‌ అయితే ఇప్పుడు నార్త్‌ రాష్ట్రాలు కూడా మెడలెత్తి చూస్తున్నాయి.

ఇంతకీ మందిరకి ప్రభాస్‌ అంతగా ఎప్పుడు నచ్చాడంటే... ‘సాహో’ షూటింగ్‌లో. మూడు భాషల్లో తీస్తున్న ‘సాహో’లో మందిరా బేడీ కూడా నటిస్తోంది. రోజూ సాహో బాహుబలి అంటూ ప్రభాస్‌ ప్రస్తావన తెచ్చి మరీ సన్మాన సభ పెట్టేస్తోందట. ప్రభాస్‌ సౌత్‌లోనే కాదు... నార్త్‌ మందిరంలో కూడా ప్లేస్‌ కొట్టేశాడన్నమాట?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement