ఆధార్‌కి లింక్‌ చేశారా? | Linked to Aadhar card ? | Sakshi
Sakshi News home page

ఆధార్‌కి లింక్‌ చేశారా?

Dec 12 2017 11:45 PM | Updated on Dec 12 2017 11:45 PM

Linked to Aadhar card ? - Sakshi

మీ పాన్‌ కార్డ్‌ని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా? గుడ్‌.మీ బ్యాంక్‌ అకౌంట్‌ని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా?వెరీ గుడ్‌.మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా? ఓసమ్‌.మీ కాలేజ్‌ ఐడీని మీ ఆధార్‌ కార్డుతో లింక్‌ చేశారా? మైండ్‌ బ్లోయింగ్‌.ఇప్పుడు ఇంకొక్క లింక్‌ మిగిలింది! అది కూడా పూర్తి చేసేస్తే మీరిక స్వచ్ఛ భారతీయుడు లేదా భారతీయురాలు. ‘అన్నీ చేసేశాం కదా ఆ మిగిలిన ఒక్క లింకూ లింకు చేయకపోతే ఏమౌతుందీ’ అని తలకింద దిండేసుకుని, చలిగా ఉంది కదా అని చెవుల దాకా దుప్పటి కప్పుకుని పడుకుంటే మీ సిటిజన్‌షిప్‌ ఢమాలే!

ఇంతకీ ఏంటా కొత్త లింకు? మీ ఆధార్‌ని మీ ఆధార్‌కి లింక్‌ చెయ్యడం! అవును. మీ ఆధార్‌ని మీరు ఎన్నిటికి లింక్‌ చేసినా, ఆధార్‌కి లింక్‌ చెయ్యకపోతే దేశంతో ఉన్న మీ లింకులన్నీ.. అంటే.. పుట్టిన ఊరు లింకు, చదివిన స్కూలు లింకు, చేస్తున్న జాబ్‌ లింకు, ఫ్యామిలీతో మీకున్న లింకూ.. అన్నిటినీ గవర్నమెంట్‌ తెంపేస్తుంది. ఆధార్‌ని ఆధార్‌కి లింక్‌ చెయ్యడానికి లాస్ట్‌ డేట్‌ డిసెంబర్‌ 31. న్యూ ఇయర్‌ డే ప్లాన్‌ ఏమైనా ఉంటే త్యాగం చేసి, మీ లైఫ్‌ని ప్లాన్‌ చేసుకోండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement