అవాంఛిత రోమాల లేజర్‌ చికిత్సతో చర్మంపై దుష్ప్రభావం ఉంటుందా?

Laser Hair Removal Is Usually Safe - Sakshi

నా వయసు 20 ఏళ్లు. నాకు ముఖంపైన కొన్నిచోట్ల రోమాలు ఉండి అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అవాంఛిత రోమాలకు లేజర్‌ చికిత్స గురించి విన్నాను. నేను ఒకవేళ లేజర్‌ చికిత్స తీసుకుంటే అది నా చర్మంపై ఏదైనా ప్రతికూల ప్రభావం చూపుతుందా? లేజర్‌ చికిత్స వల్ల ఇతరత్రా ఏమైనా సైడ్‌ఎఫెక్ట్స్‌ అంటే శాశ్వతమైన దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా? నాకు కాస్తంత  వివరించండి.

అవాంఛిత రోమాలను తొలగించడానికి వాడే లేజర్‌ చికిత్సలో అందుకు నిర్దేశించిన ఒక నిర్దిష్టమైన వేవ్‌లెంగ్త్‌లో వాటిని వాడటం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల కేవలం రోమాల్లోని కణాలు, చర్మంలోని కొన్ని నిర్దిష్టమైన కణాలు మాత్రమే ప్రభావితమవుతాయి. మరే ఇతర భాగాలూ దీనివల్ల ప్రభావితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు అవసరం లేని రోమాలకు మాత్రమే లేజర్‌ ప్రభావం పరిమితమవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు లేజర్‌ చికిత్స తీసుకోదలిస్తే దీని గురించి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా తీసుకోవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top