ప్రొఫెసర్ కత్రినా కత్తి తప్పితే! | Katrina Kaif in hollywood movie | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్ కత్రినా కత్తి తప్పితే!

Jun 23 2015 10:55 PM | Updated on Sep 3 2017 4:15 AM

ప్రొఫెసర్ కత్రినా కత్తి తప్పితే!

ప్రొఫెసర్ కత్రినా కత్తి తప్పితే!

ఇప్పుడు మనం కత్రినా కైఫ్‌ను ‘గ్లామర్ డాల్’గా మాత్రమే పరిమితం చేయలేం...

ఇప్పుడు మనం కత్రినా కైఫ్‌ను ‘గ్లామర్ డాల్’గా మాత్రమే పరిమితం చేయలేం. గతంతో పోల్చితే ఆమె నటనలో పరిణతి వచ్చింది. పాత్రలను ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. నృత్యంలోనూ మంచి ప్రతిభ చూపుతుంది. మార్షల్ ఆర్ట్స్ సూపర్‌స్టార్  జాకీ చాన్ సరసన ‘కుంగ్ ఫూ యోగ’ అనే అంతర్జాతీయ చిత్రంలో కత్రినా నటిస్తుంది. కేవలం గ్లామర్ కోసం కాకుండా హీరోకి సరిసమానంగా కత్రినా పాత్రను తీర్చిదిద్దాడట డెరైక్టర్ స్టాన్లీ టాంగ్.

ఈ సినిమాలో ప్రొఫెసర్  పాత్రలో నటిస్తున్న కత్రినా మార్షల్ ఆర్ట్స్‌లో కూడా తన సత్తా చూపనుందట. సల్మాన్‌ఖాన్ ‘ఏక్తా టైగర్’ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్‌లు చేసింది కత్రినా. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సీన్లు ‘కుంగు ఫూ యోగ’లో చేయనుందట. దీని కోసం జాకీ చాన్ దగ్గర శిక్షణ కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపుతుందట. అంతేనా...మార్షల్ ఆర్ట్స్‌కు సంబంధించిన పుస్తకాలను కూడా తెగ చదివేస్తుందట.
 
వచ్చే సంవత్సరం ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈలోపే కొందరు బాలీవుడ్ డెరైక్టర్లు కత్రినాను దృష్టిలో పెట్టుకొని  మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కథలు రాసుకోవడం మొదలుపెట్టారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement