మళ్లీ మొదలైందా? | katrina kaif close to move once again with salman khan | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదలైందా?

Apr 11 2017 11:23 PM | Updated on Sep 5 2017 8:32 AM

మళ్లీ మొదలైందా?

మళ్లీ మొదలైందా?

సల్మాన్‌ఖాన్‌ ఆదరణతో... సల్మాన్‌ అండతో... సల్మాన్‌ ప్రేమతో... సల్మాన్‌ రికమండేషన్‌తో....

గాసిప్‌

సల్మాన్‌ఖాన్‌ ఆదరణతో... సల్మాన్‌ అండతో... సల్మాన్‌ ప్రేమతో... సల్మాన్‌ రికమండేషన్‌తో.... కత్రినా కైఫ్‌ కెరీర్‌ అంతా సల్మాన్‌ జపమే! కత్తిలాంటి కత్రిన అందం చూసి కండల వీరుడి మనసు మురిసింది. ప్రేమ మొదలైంది. ఆ ప్రేమే కత్రినాను హిందీలో స్టార్‌ హీరోయిన్‌ను చేసింది. సల్మాన్‌ రికమండేషన్‌ లేకుండా కత్రిన ఈ స్థాయికి వచ్చేది కాదేమో. సల్లూభాయ్‌ ట్రాక్‌ రికార్డ్‌ చూస్తే... ఎక్కువ రోజులు ఎవర్నీ ప్రేమించిన దాఖలాలు లేవు. కానీ, కత్రినాను పెళ్లాడాలనుకున్నాడట! ఏమైందో ఏమో... సల్మాన్‌ ప్రేమకు కత్రిన కటీఫ్‌ చెప్పేసింది. ఆ కోపంతోనే సల్మాన్‌ తన చెల్లెలి పెళ్లిలో ‘ఖాందాన్‌కి కోడల్ని చేద్దామనుకుంటే కాదంటున్నావ్‌’ అని ఆమెపై జోకులు కూడా వేశాడంటారు.

కండల వీరుడికి దూరమైన తర్వాత కత్రిన కెరీర్‌ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మధ్యలో రణబీర్‌ కపూర్‌ ప్రేమలో కత్రిన, రొమేనియన్‌ నటి లులియా వంతుర్‌ ప్రేమలో సల్మాన్‌ ఊయలలు ఊగారని హిందీ మీడియా కోడై కూసింది.ఇప్పుడు రణబీర్‌ ప్రేమకు కటీఫ్‌ చెప్పిన కత్రిన, మళ్లీ సల్మాన్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందట! చూస్తుంటే... ఆమె ప్రయత్నాలు ఫలించినట్టే ఉన్నాయి. ఎందుకంటే... తన ప్రేమకు కటీఫ్‌ చెప్పిన కత్రినాను ఐదేళ్లు దూరం పెట్టిన సల్మాన్‌ మళ్లీ ‘టైగర్‌ జిందా హై’లో ఛాన్స్‌ ఇచ్చాడు. అంతే కాదండోయ్‌... ‘టైగర్‌ జిందా హై’ నిర్మాత ఆదిత్యా చోప్రా తీయబోయే మిగతా చిత్రాల్లోనూ కత్రినాను కథానాయికగా తీసుకోమని రికమండ్‌ చేస్తున్నాడట!

 అమితాబ్‌ బచ్చన్, ఆమిర్‌ఖాన్‌ హీరోలుగా ఆదిత్య చోప్రా నిర్మించనున్న ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’లో ఈ బ్యూటీకి ఛాన్స్‌ ఇవ్వమని ఆల్రెడీ హుకుం జారీ చేశాడట. సల్మాన్‌ నటించబోయే మిగతా సినిమా దర్శక–నిర్మాతలకూ ఇదే మాట చెబుతున్నాడట. కత్రినా కైఫ్‌ కెరీర్‌పై సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్‌ చేసిన సల్మాన్‌ను చూసి, మళ్లీ ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందా? లేదా ప్రేమ లేకుండానే సల్మాన్‌ రికమండ్‌ చేస్తున్నాడా అనే అనుమానాలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement