కీమోథెరపీలో జుట్టును కాపాడే ఇంజెక్షన్‌

Injection to protect hair in chemotherapy

పరిపరిశోధన

క్యాన్సర్‌ రోగులకు కీమోథెరపీ చికిత్సలో ఉపయోగించే మందుల దుష్ప్రభావం ఫలితంగా జుట్టురాలడం సర్వసాధారణంగా కనిపించే సమస్యే. కీమోథెరపీ కొనసాగుతున్నప్పుడు జుట్టురాలకుండా అరికట్టే మందులేవీ ఇంతవరకు అందుబాటులో లేవు. దీనివల్ల కీమోథెరపీ పొందే రోగులు మానసికంగా కుంగిపోయి నానా యాతన పడుతూ వస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక శుభవార్త. కీమోథెరపీ మందులు తీసుకుంటున్నా, జుట్టురాలిపోయే పరిస్థితి తలెత్తకుండా చేసే ఒక ప్రొటీన్‌ ఇంజెక్షన్‌ను తైవాన్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

కీమోథెరపీ మందులు ‘పీ–53’ అనే ప్రొటీన్‌ను ప్రేరేపిస్తాయని, ఇది జుట్టు పెరుగుదలను నిరోధిస్తోందని గుర్తించారు. దీనికి విరుగుడుగా జుట్టు పెరుగుదలకు దోహదపడే ‘డబ్ల్యూఎన్‌టీ–3’ అనే ప్రొటీన్‌ను గుర్తించారు. దీనిని ప్రయోగాత్మకంగా ఎలుకలపై పరీక్షించి, సత్ఫలితాలను సాధించామని నేషనల్‌ తైవాన్‌ వర్సిటీ శాస్త్రవేత్త సుంగ్‌ జాన్‌ లిన్‌ తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top