మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉంటే... | Sakshi
Sakshi News home page

మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉంటే...

Published Wed, May 25 2016 11:41 PM

మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉంటే... - Sakshi

ఫింగర్  ఫ్యాక్ట్స్


వేళ్లు మనుషుల స్వభావాన్ని చెబుతాయా? అవుననే అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ముఖ్యంగా చూపుడువేలు, ఉంగరం వేలు పొడవును బట్టి మనుషులను మూడు వర్గాలుగా విభజించారు. ఆ వర్గాలేమిటో తెలుసుకునే ముందు మీ చేయి బల్ల మీద పెట్టి ఒకసారి పరిశీలించుకోండి. మీ ఉంగరం వేలు చూపుడువేలు కంటే పొడవుగా ఉందా పొట్టిగా ఉందా లేదంటే రెండు సమానమైన పొడవుగా ఉన్నాయా చూసుకోండి. ఆ తర్వాత ఇది చదవండి.


ఎ. మీ ఉంగరం వేలు చూపుడు వేలుకంటే పొడవుగా ఉంటే
ఇలాంటి వాళ్లు చూడటానికి బాగుంటారు. మాటలతో ఆకట్టుకుంటారు. ఇతరులకు ఎంతదూరమైనా వెళ్లి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ప్రియుడు/ప్రియురాలిని అనుక్షణం మైమరిపిస్తారు. ఒక్కోసారి దూకుడుగా ఉంటారు. ఉంగరం వేలు పొడవుగా ఉన్నవారు డబ్బు కూడా బాగానే సంపాదిస్తారని పరిశీలన. సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో వీళ్లు ముందుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఇలాంటివాళ్లు బాగా రాణిస్తారు.


బి. మీ చూపుడు వేలు ఉంగరం వేలు కంటే పొడవుగా ఉంటే
వీళ్లు అతి విశ్వాసంతో ఉంటారు. అది ఎదుటివారికి అహంభావంగా కనిపిస్తుంది. అంతర్ముఖులు కాకపోవచ్చుగాని ఇలాంటివాళ్లు తమతో తాము గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్లకు ఎప్పుడూ దృష్టి లక్ష్యంపైనే ఉంటుంది. అయితే చొరవగా స్నేహహస్తాన్ని చాచలేరు. ప్రేమను వ్యక్తపరచలేరు. కనుక తమకు ఎదుటివారి నుంచి ఎంత దక్కితే అంతతోనే సర్దుకోవాల్సి వస్తుంది.

 
సి. చూపుడు వేలు ఉంగరం వేలు ఒకే పొడవులో ఉంటే

ఇలాంటి వారికి గొడవలంటే అస్సలు పడవు. ఈ జీవితం ఏదో ఇలా హాయిగా గడిచిపోవాలని కోరుకుంటారు. అలాగని ఎవరైనా తమను గొడవకు అనివార్యం చేస్తే గనుక ఎదుటివారికి చుక్కలు చూపిస్తారు. చూపుడువేలు ఉంగరం వేలు ఒకే పొడవులో ఉన్న వారు తమ భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. ఇంటా బయటా  ఏదైనా వ్యవహారాన్ని చక్కపెట్టడంలో వీరు సమర్థులు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement