మా అబ్బాయి బరువు తగ్గడం ఎలా? | How to reduce my son Weight? | Sakshi
Sakshi News home page

మా అబ్బాయి బరువు తగ్గడం ఎలా?

Aug 7 2013 11:29 PM | Updated on Sep 1 2017 9:42 PM

టీనేజ్‌లో నుంచి సరైన ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పకపోతే పిల్లలు మరింత బరువు పెరిగి, అది భవిష్యత్తులో ఎన్నో రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉంది.

 మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. బరువు 64 కిలోలు. వాడు విపరీతంగా బరువు పెరుగుతున్నాడు. మా వాడి విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.
 - నాగరాణి, సింగరాయకొండ 
 
 టీనేజ్‌లో నుంచి సరైన ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పకపోతే పిల్లలు మరింత బరువు పెరిగి, అది భవిష్యత్తులో ఎన్నో రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే మీ బాబు వయసులోనే వాళ్లకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... 
 
 స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్,  జామ్ వంటి వాటిని  క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. 
 
  బేకరీ ఉత్పాదనల్లోని కొవ్వు పాళ్లు పిల్లల్లో బరువును మరింతగా పెంచుతాయి. కాబట్టి కొవ్వుతో ఉండే ఆహారాలను పరిహరించి, పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి తినడం అలవాటు చేయాలి.  
 
 వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. 
 
 సాధ్యమైనంతవరకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాలే ఇవ్వడం మంచిది. 
 
 పై అలవాట్ల నేర్పడంతో పాటు ముందుగా పిల్లల్లో థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి, అవేవీ లేవని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. 
 
 డాక్టర్ భక్తియార్ చౌదరి
 స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement