రక్తం ఎలా తయారవుతుంది? | How to make blood? | Sakshi
Sakshi News home page

రక్తం ఎలా తయారవుతుంది?

Mar 10 2014 12:13 AM | Updated on Apr 3 2019 4:24 PM

రక్తం ఎలా తయారవుతుంది? - Sakshi

రక్తం ఎలా తయారవుతుంది?

మనకెప్పుడైనానా వేలు తెగినప్పుడో, ఆటల్లో గాయం తగిలినప్పుడో రక్తం కారడం గమనించే వుంటారు కదా

 మనకెప్పుడైనానా వేలు తెగినప్పుడో, ఆటల్లో గాయం తగిలినప్పుడో రక్తం కారడం గమనించే వుంటారు కదా! మనం శరీరంలో దాదాపు నాలుగున్నర నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇంతకీ రక్తంలో ఏమేమి వుంటాయి? అది ఎలా తయారవుతుందో తెలుసా? ఎక్కడోకాదు... మన శరీరంలోనే తయారవుతుంది.

అయితే దానికి కూడా కొన్ని పదార్థాలు కావాలి. అవి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా అనే నాలుగు పదార్థాలు. ఎర్రరక్తకణాలేమో ఆమ్లజనిని శరీరమంతా అందేలా చేస్తాయి. తెల్లరక్తకణాలేమో ఇన్ఫెక్షన్లతో యుద్ధం చేస్తాయి. రక్తంలో ప్లేట్‌లెట్లు ఉండటం వల్ల దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకడుతుంది.   ప్లాస్మా అనే పసుపు పచ్చని ద్ర వపదార్థం మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, హార్మోన్లు, ప్రొటీన్లను శరీరమంతటికీ అందిస్తుంది.

శరీరమే మన ఎముక లలో ఉండే బోన్‌మారో అనే గుజ్జువంటి పదార్థాన్ని ఉపయోగించి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లను తయారు చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం, నీరు పేగుల్లో చేరతాయి కదా, వాటిలోని పోషకాలను, ఇతర సారం నుంచి ఊపిరితిత్తులు పీలుస్తూ, విడుస్తూ ఉండే గాలి ద్వారా రక్తం పంపులాగా కొట్టబడి, దానినుంచి ప్లాస్మా తయారవుతుంది. అంటే ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా... ఇవన్నీ కలిస్తే రక్తం తయారవుతుందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement