breaking news
Describe
-
..ఇక ఇరాన్ వంతు !!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని ఆ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ శాక్స్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ట్రంప్ అదుపు తప్పారు. ఆయనది మతిలేని దూకుడు’’ అంటూ విమర్శించారు. అమెరికా నిత్యం పాటిస్తానని గొప్పగా చెప్పుకునే నిబంధనలు నిజానికి కాకమ్మ కథలు మాత్రమేనంటూ దుయ్యబట్టారు. వెనెజువెలా అనంతరం ట్రంప్ తదుపరి లక్ష్యం కచ్చితంగా ఇరాన్ అని తాజాగా ఇండియాటుడే వార్తాసంస్థతో మాట్లాడుతూ శాక్స్ అభిప్రాయపడ్డారు. ‘‘ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే ఫ్లోరిడాలోని మారా లాగో ఎస్టేట్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. తదుపరి లక్ష్యం ఇరాన్ అని ఆ సందర్భంగా వారిద్దరూ నిర్ణయానికి వచ్చారు’’ అని వెల్లడించారు. అమెరికాను ధూర్త దేశం (రోగ్ స్టేట్)గా శాచ్స్ అభివర్ణించారు. ఇజ్రాయెల్ అంతకుమించిన ధూర్త దేశమంటూ ఆక్షేపించారు. ‘‘అవి రెండూ నిజంగా ఇరాన్‌పై భారీ ఎత్తున దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచ యుద్ధ స్థాయికి విస్తరిస్తుంది’’ అని హెచ్చరించారు. ఇరాన్ వద్ద పలు అత్యాధునిక క్షిపణులున్నాయని గుర్తు చేశారు. ‘‘ఇరాన్ మాత్రమే కాదు. మెక్సికో, కొలంబియా, క్యూబా, డెన్మార్క్, నైజీరియా ఇలా కనీసం మరో అర డజను దేశాలను ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాద పోకడలను భారత్ తదితర బ్రిక్స్ దేశాలే అడ్డుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్దేనని యూరప్ దేశాలన్నీ ముక్తకంఠంతో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.పిల్ల చేష్టల ట్రంప్సైన్యం, ముఖ్యంగా సీఐఏ, పెంటగాన్ వంటి భద్రతా సంస్థలు, ఇంకా సామ్రాజ్యవాద కుబేరులతో కూడిన రాజ్యాంగేతర శక్తి అయిన డీప్‌స్టేట్ ప్రస్తుతం అమెరికాను పాలిస్తోందంటూ శాక్స్ ఆరోపించారు. ‘‘ఇక ట్రంప్ నిజానికి ఓ ఉన్మాది. ఎక్కడ చమురు కనిపించినా అది తమదేననే రకం. ఆయనవి పిల్ల చేష్టలు. వెనెజువెలాపై ఆయనకు ఎప్పట్నుంచో కన్నుంది. తొలి దఫా అధ్యక్షునిగా ఉండగా 2017లో లాటిన్ అమెరికాకు చెందిన పలువురు నేతలను విందుకు పిలిచారు. వెనెజువెలాపై తానెందుకు దాడి చేయకూడదని వారిని అడిగారు. అది ప్రాంతీయ అస్థిరతకు దారి తీస్తుందంటూ వారు వారించడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు మాత్రం మతిలేని దూకుడుతో మదురోను బంధించి తీసుకెళ్లారు. అయితే దీని వెనక డీప్‌స్టేట్ అజెండా సైతం దాగుంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ విధానాన్ని నియంత్రించేంది అధ్యక్షుడు కాదు, డీప్‌స్టేట్’’ అని శాక్స్ చెప్పుకొచ్చారు. ‘‘నిజానికి ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా 20 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే వస్తోంది. కానీ పలు దేశాల్లో నాయకత్వాన్ని మార్చేందుకు ఇప్పటిదాకా అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. వెనెజువెలాలో అదే పునరావృతం అయ్యేలా కన్పిస్తోంది’’ అని అంచనా వేశారు. -
వేధింపులపై మొదటి అనుభవాలు!
తెలిసీ తెలియని వయసునుంచే అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసులోనే తమపై వేధింపులు ప్రారంభమౌతున్నట్లు అమ్మాయిలు ప్రత్యక్షంగా చెప్తున్నారు. యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న కొన్ని వీడియోలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అతిచిన్న వయసులోనే ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి కొందరు చెప్పిన వివరాలు ఓల్డ్ ఢిల్లీ ఫిల్మ్స్ 'తెర'కెక్కించింది. భారతదేశంలో అమ్మాయిలు చిన్నతనంలోనూ, యుక్తవయసులోనూ కూడ లైంగిక వేధింపులకు గురికావడం సర్వ సాధారణమైపోయింది. జీవితంలో ఎదురయ్యే సంఘటనల గురించి, స్వభావాలగురించి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడంతోనే పిల్లలు ఇలా గందరగోళంలో పడటం, భయానకంగా మారడం జరుగుతోందని కొందరి అభిప్రాయం. అయితే 14 ఏళ్ళ అమ్మాయి తనకు ఎదురైన జిగుప్సాకరమైన అనుభవం ప్రత్యక్షంగా చెప్పడం చూస్తే... తల్లిదండ్రులు, పెద్దల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు అంతా సిగ్గుపడాల్సిన అంశంగా కూడ మారింది. ముఖ్యంగా భారత దేశంలో అమ్మాయిలు యుక్తవయసు వచ్చేసరికి పురుషులనుంచి అవాంఛిత లైంగిక సంబంధాలను ఏర్పరచుకొంటున్నట్లు తెలుస్తోంది. అయితే పిల్లలు.. ముఖ్యంగా కొడుకుల పెపంపకం విషయంలో తల్లులు సరైన జాగ్రత్తలను తీసుకోవడం లేదని అమ్మాయిలు చెప్తున్నారు. విషయాలను అర్థమయ్యేట్లు బోధించడం మహిళల ప్రత్యేక విధి అంటున్నారు. అంతేకాదు తండ్రి కూడ బాధ్యత తీసుకోవాలంటున్నారు. అయితే చెప్పేది ఎవరైనా సరిగా చెప్పడం అన్నది మాత్రం ఇక్కడ అవసరం అంటున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు వారి స్వేచ్ఛను సైతం హరిస్తున్నాయి. దీంతోనే ఆడపిల్లలు బయటకు వెళ్ళద్దు వంటి అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుత వీడియోల్లోని మహిళల అనుభవాలను చూస్తే వయోజనులే కాక యువకులు సైతం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత దేశంలో 2007 లెక్కల ప్రకారం చూస్తే... ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు పెద్దలవల్ల లైంగిక వేధింపులకు గురౌతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. ప్రస్తుతం యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న వీడియోల్లోని ప్రసంగాలు ప్రారంభవాచకాలు కావాలి. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఇవే నాంది పలకాలి. -
రక్తం ఎలా తయారవుతుంది?
మనకెప్పుడైనానా వేలు తెగినప్పుడో, ఆటల్లో గాయం తగిలినప్పుడో రక్తం కారడం గమనించే వుంటారు కదా! మనం శరీరంలో దాదాపు నాలుగున్నర నుంచి 6 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. ఇంతకీ రక్తంలో ఏమేమి వుంటాయి? అది ఎలా తయారవుతుందో తెలుసా? ఎక్కడోకాదు... మన శరీరంలోనే తయారవుతుంది. అయితే దానికి కూడా కొన్ని పదార్థాలు కావాలి. అవి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా అనే నాలుగు పదార్థాలు. ఎర్రరక్తకణాలేమో ఆమ్లజనిని శరీరమంతా అందేలా చేస్తాయి. తెల్లరక్తకణాలేమో ఇన్ఫెక్షన్లతో యుద్ధం చేస్తాయి. రక్తంలో ప్లేట్లెట్లు ఉండటం వల్ల దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకడుతుంది. ప్లాస్మా అనే పసుపు పచ్చని ద్ర వపదార్థం మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలు, హార్మోన్లు, ప్రొటీన్లను శరీరమంతటికీ అందిస్తుంది. శరీరమే మన ఎముక లలో ఉండే బోన్‌మారో అనే గుజ్జువంటి పదార్థాన్ని ఉపయోగించి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లను తయారు చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం, నీరు పేగుల్లో చేరతాయి కదా, వాటిలోని పోషకాలను, ఇతర సారం నుంచి ఊపిరితిత్తులు పీలుస్తూ, విడుస్తూ ఉండే గాలి ద్వారా రక్తం పంపులాగా కొట్టబడి, దానినుంచి ప్లాస్మా తయారవుతుంది. అంటే ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా... ఇవన్నీ కలిస్తే రక్తం తయారవుతుందన్నమాట.


