చేతులకు సొన అంటకుండా.. | Sakshi
Sakshi News home page

చేతులకు సొన అంటకుండా..

Published Tue, Oct 27 2015 10:36 PM

చేతులకు సొన అంటకుండా..

ఇంటిప్స్
 
గుడ్డు లోని తెల్లసొన నుంచి పచ్చసొనను వేరుచేయడానికి ఈ బాటిళ్లు బాగా ఉపయోగపడతాయి. ఒక గిన్నెలో గుడ్డు కొట్టాక అందులోని పచ్చసొన పై బాటిల్‌ను అదిమి పట్టుకోవాలి. తర్వాత బాటిల్‌ను లూజ్ చేస్తే అది ఆ పచ్చసొనను పీల్చేస్తుంది. దాంతో చేతులకు ఏ మాత్రం సొన అంటకుండా రెండింటినీ వేరు చేయవచ్చు ఈ బాటిళ్ల సాయంతో.
 
మొదట నాలుగైదు కూల్‌డ్రింక్స్ బాటిల్స్ తీసుకోవాలి. అవి లీటర్, రెండు లీటర్ల బాటిళ్లు అయితే ఇంకా మంచిది. బాటిళ్లను కోసి వాటి అడుగు భాగాలను సెపరేట్ చేసుకోవాలి. ఒక 12 ఇంచ్ రాడ్‌ను తీసుకొని దానికి ఈ అడుగుభాగాలను అమర్చాలి. అలా కంపార్ట్‌మెంట్లు ఉన్న చోట చెవి దుద్దులు, మెడ గొలుసులు, ఉంగరాలు పెట్టుకోవచ్చు.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement