ఇంటికి అందం.. వంటింటికి రుచి | home made tops | Sakshi
Sakshi News home page

ఇంటికి అందం.. వంటింటికి రుచి

Dec 16 2015 11:33 PM | Updated on Sep 3 2017 2:06 PM

ఇంటికి అందం.. వంటింటికి రుచి

ఇంటికి అందం.. వంటింటికి రుచి

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, గ్రైండ్ చేసేప్పుడు ఒక స్పూన్ నూనె కలపాలి.పండ్లను కోశాక ముక్కలు

ఇంటిప్స్

అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, గ్రైండ్ చేసేప్పుడు ఒక స్పూన్ నూనె కలపాలి.పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా వుండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పాలి.బంగాళాదుంప, చిలగడదుంప మొలకలు పెరిగితే, వాటిని ముక్కలుగా కోసి కుండీలలో... జార్‌లో నీళ్ళుపోసి పెంచొచ్చు. ఇండోర్ ప్లాంట్‌గా ఇంటి అందాన్ని పెంచుతాయి.ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండడానికి వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచాలి. ఖీర్ మిగిలిపోతే మళ్ళీ వేడి చేయకూడదు. దాన్నలాగే కుల్ఫీకప్స్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి, పిల్లలకివ్వవచ్చు.
     
కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి ఆకు కూరలు న్యూస్‌పేపర్‌లో చుట్టి పాలిథిన్ కవర్‌లో వుంచితే ఎక్కువకాలం నిలవ వుంటాయి.గోడలమీద క్రేయాన్‌తో గీసిన గీతలు పోవాలంటే సిగరెట్ బూడిదతో రుద్దాలి. కిరోసిన్ లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోతాయి. ఆ వాసనకు దోమలు కీటకాలు ఇంట్లోకి రావు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement