మార్కెట్లోకి ఎల్‌జీ ‘ఫ్రెంచ్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్‌’ | LG French Door Refrigerator India launch Auto Ice Maker InstaView price features | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ఎల్‌జీ ‘ఫ్రెంచ్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్‌’

Jun 14 2026 11:32 AM | Updated on Jun 14 2026 12:45 PM

LG French Door Refrigerator India launch Auto Ice Maker InstaView price features

హైదరాబాద్‌: గృహోపకరణాల తయారీ సంస్థ ‘ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా’ మార్కెట్లోకి సరికొత్త ఫ్రెంచ్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. భారతీయ కుటుంబాల జీవన విధానం, అవసరాలకు అనుగుణంగా 83.82 సెం.మీ (33 అంగుళాల) వెడల్పు విభాగంలో ‘ఆటో ఐస్‌ మేకర్‌’ సదుపాయంతో వీటిని రూపొందించారు. 574 లీటర్ల నుండి 610 లీటర్ల సామర్థ్యంతో లభించే ఈ రిఫ్రిజిరేటర్లు దేశవ్యాప్తంగా రిటైల్‌ అవుట్‌లెట్లలో లభిస్తాయి. ప్రారంభ ధర రూ.1.18 లక్షలతో అందుబాటులో ఉన్నాయి.

ఈ సరికొత్త ఫోర్‌–డోర్‌ నిర్మాణంలో ‘రిఫ్రిజిరేటర్‌’ పై భాగంలో, ‘ఫ్రీజర్‌’ దిగువ భాగంలో ఉన్నాయి. ఇందులో అమర్చిన ఎల్‌జీ ‘ఇన్‌స్టా వ్యూ’ ఫీచర్‌ ద్వారా కేవలం రెండుసార్లు తట్టడంతోనే లోపల ఉన్న వస్తువులను చూడవచ్చు. ఆహార పదార్థాల తాజాదనం కోసం ‘ఫ్రెష్‌ కన్వర్టర్‌ ప్లస్‌’, నిరంతర ఐస్‌ ఉత్పత్తి కోసం రీఫిల్‌ చేయగల వాటర్‌ ట్యాంక్‌ సిస్టమ్‌ గల ‘ఆటో ఐస్‌ మేకర్‌’ ఉన్నాయి. వీటితో పాటు ఇన్‌బిల్ట్‌ వాటర్‌ డిస్పెన్సర్, డోర్‌ కూలింగ్, హైజీన్‌ ఫ్రెష్‌ ప్లస్, స్మార్ట్‌ లెర్నర్‌ కూలింగ్‌ టెక్నాలజీ, ఎల్జీ థింక్‌ వై–ఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా హోమ్‌ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ యంగ్‌ మిస్‌ హ్వాంగ్‌ మాట్లాడుతూ ‘‘భారతీయ వినియోగదారుల రోజువారీ జీవితాన్ని మెరుగుపరిచే ఆవిష్కరణలను తీసుకురావడానికి మేము నిరంతరం కృషి చేస్తాం. మా కొత్త ఫ్రెంచ్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్‌ శ్రేణి ప్రీమియం డిజైన్, సౌలభ్యం, స్మార్ట్‌ టెక్నాలజీ పట్ల మాకున్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement