నాజూకు లినెన్ | heroine new fashion show with sarees | Sakshi
Sakshi News home page

నాజూకు లినెన్

Nov 10 2016 10:19 PM | Updated on Sep 4 2017 7:44 PM

నాజూకు   లినెన్

నాజూకు లినెన్

లినెన్ సుతిమెత్తగా ఉంటుంది.

లినెన్ సుతిమెత్తగా ఉంటుంది.
లినెన్ ఒంటికి హాయిగా ఉంటుంది
లినెన్ కంటికి ఇంపుగా ఉంటుంది
అన్నింటికీ మించి లినెన్ స్టైలిష్‌గా ఉంటుంది
లినెన్ హుందాగా ఉంటుంది
లినెన్ నాజూకుగా ఉంటుంది.
లినెన్ ఫ్యాషన్‌లో ముందుంటుంది


చలి, ఎండ కాలాలకు కాటన్ ఎప్పుడూ మొదటి ఎంపిక. వాటిలో ముఖ్యంగా లినెన్ కాటన్ చీరలు ధరించినప్పుడు ఆభరణాలు, ఇతర అలంకరణ వస్తువులపై శ్రద్ధ పెట్టాలి.

సింపుల్‌గా ఉండే ఈ చీరలు, డ్రెస్సుల మీదకు బంగారు, సంప్రదాయ ఆభరణాలు అంతగా నప్పవు.

కలప, పూసలు, టైట, స్టీలు, థ్రెడ్.. వంటి వాటితో తయారుచేసిన హ్యాండ్‌మేడ్ ఆభరణాలే నప్పుతాయి.

బ్యాగులు, పాదరక్షలు కూడా లెదర్‌వి, హ్యాండ్‌మేడ్‌వే ఎంచుకోవాలి.

ఏ ఆభరణాలు ధరించకపోయినా కాటన్ శారీ, డ్రెస్ ఎప్పుడూ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

వంగపండు రంగు లినెన్ చీర, దానికి పూర్తి కాంట్రాస్ట్ కలర్ వైట్‌లో సాధారణ బ్లౌజ్... స్ట్రీట్ ఫ్యాషన్ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తుంది. ఆభరణాల ఊసు అంతగా లేని ఈ స్టైల్ పాత, కొత్త - అన్ని తరాలనూ ఆకట్టుకుంటుంది.

టాప్ టు బాటమ్ ఒకే రంగు,  ఒకే ఫ్యాబ్రిక్ అయినా, తన ప్రత్యేకతను చూపుతుంది లినెన్. వేలమందిలో ఉన్నా వేడుకగా కనువిందు చేస్తుంది.

అఫిషియల్ వేర్‌గా నేత చీరలకు మంచి పేరుంది. వాటిలోనూ లినెన్ చీర  తన ప్రత్యేకతను  చాటుకుంటుంది.

ఏ హ్యాండ్లూమ్ డిజైనర్ బ్లౌజ్ అయినా ఈ చీరల మీదకు బాగా నప్పుతుంది.

సింపుల్, మోడ్రన్, స్టయిలిష్ లుక్‌తో ఆకట్టుకోవాలనుకునేవారికి ఇష్టమైన వస్త్రంగా లినెన్ రూపు  మార్చుకొని, ఇలా చీరగా సింగారించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement