లవంగం... స్ట్రెస్‌ బస్టర్‌!

Healthy Food clove Stress Buster!

హెల్దీ ఫుడ్‌

లవంగాన్ని సుగంధద్రవ్యంగా వంటల్లో ఉపయోగిస్తారు. ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తున్నప్పుడు ఒక్క లవంగమొగ్గను బుగ్గన పెట్టుకుంటే ఆ దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. లవంగంతో కలిగే మరికొన్ని ప్రయోజనాలు.

►లవంగం నోటికి సంబంధించిన చాలా విషాలను లవంగం హరిస్తుంది. దాంతో శ్వాస తాజాగా ఉంటుంది.
►గొంతు బొంగురుగా ఉన్నప్పుడు, గొంతునొప్పి ఉండి, పట్టేసినట్లుగా ఉన్నప్పుడు లవంగాన్ని నోట్లో ఉంచుకొని చప్పరిస్తూ, ఆ రసం కొద్దికొద్దిగా మింగుతూ ఉంటే గొంతులోని ఇబ్బంది తగ్గుతుంది.
►లవంగం మంచి స్ట్రెస్‌బస్టర్‌. కొన్ని తులసి ఆకులు, కాసిన్ని పుదీనా ఆకులు, ఇంకొన్ని యాలకులతో పాటు రెండు లవంగం మొగ్గలను నీళ్లలో కాచి తాగితే ఒత్తిడి తొలగిపోయి, కొత్తగా శక్తి పుంజుకుంటారు.
►వాంతి వచ్చినట్లుగా ఉన్నప్పుడు ఒక లవంగం నోట్లో పెట్టుకొని చప్పరించడం మంచిది. లవంగం వల్ల వికారం, వాంతులు కూడా తగ్గుతాయి.
►లవంగం టీ కింది నుంచి వెళ్లే గ్యాస్‌ సమస్యను నివారిస్తుంది. అంతేకాదు... లవంగం జీర్ణశక్తిని పెంచి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
►లవంగాలు హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టిస్తాయి. అందుకే వాటిని  నోటిలో ఉంచుకొని చప్పరించినప్పుడు చిగుర్లపై ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నిర్మూలించడం వల్ల పళ్ల, చిగుర్ల ఆరోగ్యం బాగుంటుంది.
►లవంగం నుంచి తీసే యూజెనాల్‌ అనే రసాయనంలో నొప్పిని తగ్గించే గుణం ఉంది. అందుకే పంటి నొప్పికి లవంగం నూనెను ఉపయోగిస్తుంటారు.
►లవంగంలోని చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌లను సమర్థంగా నివారిస్తాయి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top