హెల్త్‌ టిప్స్‌ | health tips | Sakshi
Sakshi News home page

హెల్త్‌ టిప్స్‌

Sep 15 2017 12:12 AM | Updated on Apr 7 2019 4:37 PM

హెల్త్‌ టిప్స్‌ - Sakshi

హెల్త్‌ టిప్స్‌

పళ్లనొప్పులకు... అర టీ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి.

పళ్లనొప్పులకు... అర టీ స్పూన్‌ నల్ల మిరియాల పొడి, కొద్దిగా లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా తయారు చేయాలి. దాన్ని నొప్పి పెడుతున్న పంటిపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పంటినొప్పి తగ్గడంతోపాటు పళ్లు దృఢంగా తయారవుతాయి. గొంతునొప్పి, మంట, దగ్గుకు... టేబుల్‌ స్పూన్‌ తాజా నిమ్మరసం, అర స్పూన్‌ నల్ల మిరియాల పొడి, టీస్పూన్‌ ఉప్పులను ఒక గ్లాస్‌ వేడినీటిలో కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నోటిలో పోసుకుని పుక్కిలిస్తూ ఉంటే గొంతునొప్పి, మంట, దగ్గు తగ్గుతాయి.

తలనొప్పి నివారణకు యాస్ప్రిన్‌ వేసుకోవడం అందరూ చేసే పనే. అలా కాకుండా దాల్చిన చెక్కను నీటితో తడిపి అరగదీసి కణతలకు పూస్తూ ఉంటే తలనొప్పి ముఖ్యంగా జలుబు వల్లవచ్చే తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. అజీర్తి, పులితేన్పులు వస్తుంటే రెండు చిటికలు దాల్చిన చెక్క , రెండు చిటికలు శొంఠిపొడి, నాలుగు చిటికలు యాలకుల పొడీ కలిపి రోజూ భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే  అజీర్ణం, తేపులు రాకుండా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement