యాంటీబయాటిక్‌ మోతాదును లెక్కించే గాడ్జెట్‌... | Sakshi
Sakshi News home page

యాంటీబయాటిక్‌ మోతాదును లెక్కించే గాడ్జెట్‌...

Published Tue, Sep 11 2018 5:10 AM

Gadget to calculate antibiotic dose - Sakshi

యాంటీబయాటిక్‌ మందులతో జబ్బులు నయం కావచ్చునేమోగానీ.. దుష్ప్రభావాలు కొన్ని ఉండనే ఉంటాయి. అయితే మందు ఏ స్థాయిలో వాడితే దుష్ప్రభావాలు తక్కువ అవుతాయో తెలుసుకుంటే ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. మిగిలిన వాటి మాటెలా ఉన్నా వాన్కోమైసిన్‌ అనే యాంటీబయాటిక్‌ మోతాదును రక్తంలో సులువుగా గుర్తించేందుకు ఈపీఎఫ్‌ఎల్‌ విద్యార్థులు కొందరు ఓ విన్నూతమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. సెన్స్‌ యూ పేరుతో నిర్వహహిస్తున్న అంతర్జాతీయ బయోసెన్సర్ల పోటీ కోసం తయారుచేసిన ఈ వినూత్నమైన పరికరం భవిష్యత్తులో ఇతర యాంటీబయాటిక్‌లకూ ఉపయోగపడుతుందని ఈ విద్యార్థులు తెలిపారు.

వాన్కోమైసిన్‌ వాడకం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని, బధిరత్వం వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు దీన్ని ఉపయోగిస్తూంటారు. రక్తంలో యాంటీబయాటిక్‌ ఎంత మోతాదులో ఉందో తెలిస్తే.. అందుకు తగ్గట్టుగా తదుపరి డోస్‌లను నిర్ణయించుకోవచ్చునని, తద్వారా సైడ్‌ ఎఫెక్ట్స్‌ను తక్కువ చేయవచ్చునని విద్యార్థులు తెలిపారు. వాన్కోమైసిన్‌ తో జట్టుకట్టగల ఒక పెప్టైడ్‌ను సృష్టించి, ప్రతిదీప్తి లక్షణమున్న పదార్థాన్ని జోడించడం ద్వారా తాము ఈ సెన్సర్‌ను తయారు చేసినట్లు వివరించారు.

Advertisement
Advertisement