జీర్ణ వ్యవస్థకు అంజీర్‌

Fig of digestive system - Sakshi

గుడ్‌ ఫుడ్‌

అంజీర్‌ రుచి ఎంత బాగుంటుందో... దానివల్ల సమకూరే ఆరోగ్య ప్రయోజనాలూ అంత ఎక్కువగా ఉంటాయి. అంజీర్‌లతో మనకు ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇక్కడ చెప్పినవి కొన్ని మాత్రమే. 

చర్మంపై ముడుతలు రావడం వంటి వయసు పెరగడం వల్ల కనిపించే అనర్థాలను   నివారించి, అంజీర్‌ దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతుంది. అంజీర్‌లో పీచు (ఫైబర్‌) చాలా ఎక్కువ. అందుకే అంజీర్‌ తినడం వల్ల మలబద్దకాన్ని తేలిగ్గా తగ్గిస్తుంది. అంతేకాదు... అంజీర్‌ తినడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా శుభ్రం అవుతుంది. నీళ్ల విరేచనాలు, ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)  వంటి సమస్యలూ తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునేవారు అంజీర్‌ తినడం మంచిది. మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటికి వచ్చే అనేక వ్యాధులను నివారిస్తుంది. అంజీర్‌లో కొలెస్ట్రాల్‌తో పాటు కొవ్వులు చాలా తక్కువ. అందువల్ల ఇది చాలా రకాల గుండెజబ్బులను, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్‌ కొవ్వులను తగ్గిస్తుంది. కొవ్వులు తక్కువగా ఉండటంతో పాటు ఫీనాల్, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌ వంటి పోషకాల కారణంగా గుండెజబ్బులు నివారితమవుతాయి. అంజీర్‌తో ఎన్నో రకాల క్యాన్సర్లను నివారించవచ్చు. పెద్దపేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ను నివారించే ఎన్నో యాంటీఆక్సిడెంట్స్‌ ఇందులో ఉన్నాయి. 

అంజీర్‌లో పొటాషియమ్‌ ఎక్కువ. సోడియమ్‌ చాలా తక్కువ. అందువల్ల ఇది రక్తపోటును సమర్థంగా నివారిస్తుంది. బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా ఉన్నవారిలో దాని తీవ్రతను తగ్గించడానికి, క్రమంగా నివారించడానికి అంజీర్‌ బాగా తోడ్పడుతుంది. వీటిల్లో ఐరన్‌ చాలా ఎక్కువ. అందుకే రక్తహీనత (అనీమియా)తో బాధపడేవారికి డాక్టర్లు అంజీర్‌ను సిఫార్సు చేస్తుంటారు. మూత్రంలో క్యాల్షియమ్‌ వృధాగా పోవడాన్ని అంజీర్‌ సమర్థంగా అరికడుతుంది. అంజీర్‌లో క్యాల్షియమ్‌ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అవి బలంగా ఉండేలా చూస్తుంది. అంజీర్‌లో జింక్, మాంగనీస్, మెగ్నీషియమ్‌ వంటి అనేక ఖనిజాలు ఉండటంతో పాటు చాలా మంచి పోషకాలు ఉండటం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top