అశ్వమా... మనువాడుదామా... | Equine ... manuvadudama ... | Sakshi
Sakshi News home page

అశ్వమా... మనువాడుదామా...

Jan 17 2015 7:18 AM | Updated on Sep 2 2017 7:46 PM

అశ్వమా... మనువాడుదామా...

అశ్వమా... మనువాడుదామా...

‘‘నీ సకిలింపు నాకెంతో ఇంపు... మన జంట చూపరుల కనులకు ఇంపు’’ అంటూన్న ఆ పాస్టర్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

చదివింత......::: సత్యవర్షి
 
‘‘నీ సకిలింపు నాకెంతో ఇంపు... మన జంట చూపరుల కనులకు ఇంపు’’ అంటూన్న ఆ పాస్టర్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అమెరికాలోని మిసిసిపి నగరంలో నివసించే పాస్టర్ ఎడ్వర్డ్ జేమ్స్... రీసెంట్‌గా పెళ్లాడారు. అదీ మనిషిని కాదు గుర్రాన్ని. అచ్చంగా వెడ్డింగ్ డ్రెస్ వగైరా అలంకారాలు చేసి మరీ గుర్రంతో తన  పెళ్లి తంతును ట్రెడిషనల్‌గా పూర్తి చేశారు. అది కూడా  ఫెడరల్ కోర్ట్ ఆవరణలో బహిరంగంగా.

ఇంతకీ ఈయనగారు అంతగా అశ్వారాధకుడు ఎందుకయ్యాడు? ఏకంగా ఆలిగా ఎందుకు చేసుకున్నాడు? అంటే... ఇదంతా  నిరసన తెలపడంలో భాగంగానే అంటున్నారు. అమెరికాలోని మిసిసిపిలో స్వలింగ సంపర్కుల వివాహాలపై నిషేధం ఉంది. అయితే దీనిని ఎత్తేయాలని, మిసిసిపిలో ఉన్న 3,484 గే కపుల్స్ హక్కులను కాపాడాలని న్యాయస్థానాలను కొందరు ఆశ్రయించారు. దీనిపై ప్రస్తుతం వాదోపవాదాలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గే మ్యారేజెస్‌పై ఆంక్షలకు వ్యతిరేకంగా  గుర్రాన్ని పెళ్లాడిన జేమ్స్... ‘‘గుర్రంతో నా పెళ్లిని నిషేధిస్తారా? లేక సేమ్ సెక్స్ మ్యారేజ్ స్టేటస్ ఇస్తారా? లేక మమ్మల్ని కలిసి ఉండమంటారా?’’ అంటూ ఊపిరి సలపనివ్వని ప్రశ్నలతో అక్కడి మీడియాకు చేతినిండా పని కల్పిస్తున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement