ఎల్‌ఈడీలు ఇక మరింత చౌక! | Elidilu   The more Cheap! | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీలు ఇక మరింత చౌక!

Mar 20 2014 2:40 AM | Updated on Sep 2 2017 4:55 AM

ఎల్‌ఈడీలు  ఇక మరింత చౌక!

ఎల్‌ఈడీలు ఇక మరింత చౌక!

ఎల్‌ఈడీ లైట్లు తక్కువ విద్యుత్తు వాడతాయి...

\ఎల్‌ఈడీ లైట్లు తక్కువ విద్యుత్తు వాడతాయి... ఎక్కువకాలం మన్నుతాయి. కానీ ఒక్కో బల్బు ఖరీదు అయిదారు వందల రూపాయలకు తక్కువేమీ ఉండదు. కరెంటు ప్రవాహంలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు ఈ బల్బుల్లో ఏర్పాటు చేసే డ్రైవర్లతో ధర అమాంత పెరిగిపోతోంది.


జర్మనీలోని ఫ్రాన్‌హోవర్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడీ పరిస్థితి మారనుంది. ఎల్‌ఈడీ బల్బుల ఖరీదును గణనీయంగా తగ్గించగలిగే గాలియం నైట్రైడ్ ట్రాన్సిస్టర్లను తయారు చేసిందీ సంస్థ. ఈ ట్రాన్సిస్టర్లతో కూడిన డ్రైవర్లు సంప్రదాయ సిలికాన్ ట్రాన్సిస్టర్ల కంటే పదిరెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తాయి ఇవి. చిత్రంలో కనిపిస్తున్నది గాలియం నైట్రైడ్ ట్రాన్సిస్టర్లతో కూడిన ఎల్‌ఈడీ బల్బే.
 

Advertisement
 
Advertisement
Advertisement