ఎగ్‌–బ్రెడ్‌ టోస్ట్‌ | Egg-bread toast | Sakshi
Sakshi News home page

ఎగ్‌–బ్రెడ్‌ టోస్ట్‌

Mar 14 2017 11:07 PM | Updated on Sep 5 2017 6:04 AM

ఎగ్‌–బ్రెడ్‌ టోస్ట్‌

ఎగ్‌–బ్రెడ్‌ టోస్ట్‌

ముందుగా ఒక పాత్రలో కోడిగుడ్లు బాగా గిలక్కొట్టాలి.

 హెల్దీ కుకింగ్‌

తయారి సమయం: 10 నిమిషాలు
కావలసినవి: కోడిగుడ్లు – రెండు బ్రెడ్‌ స్లైసెస్‌ – ఆరు (ఒక్కో దానిని రెండేసి ముక్కలుగా త్రికోణాకారంలో కట్‌ చేసుకోవాలి) మిరియాల పొడి – టీ స్పూన్‌ ఉప్పు – చిటికెడు నూనె – టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడా – చిటికెడు కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూన్‌
తయారి:ముందుగా ఒక పాత్రలో కోడిగుడ్లు బాగా గిలక్కొట్టాలి.అందులో మిరియాలపొడి, ఉప్పు, బేకింగ్‌ సోడా, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.నాన్‌స్టిక్‌ పాన్‌ వేడయ్యాక  కొద్దిగా నూనె వేయాలి.ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి పాన్‌ పై వేయాలి. రెండు వైపులా ఎరుపు రంగు వచ్చేవరకు కాల్చి తీయాలి.

 

Advertisement
 
Advertisement
Advertisement