బ్రెడ్‌, రస్క్‌ నుంచి రూ. 822 కోట్ల సామ్రాజ్యం వరకు..! | Success Story: From Bread And Rusk To A Rs 822 Crore Empire | Sakshi
Sakshi News home page

బ్రెడ్‌, రస్క్‌ నుంచి రూ. 822 కోట్ల సామ్రాజ్యం వరకు..!

Oct 13 2026 4:56 PM | Updated on Oct 13 2026 5:08 PM

Success Story: From Bread And Rusk To A Rs 822 Crore Empire

ఏ స్టార్టప్‌లు అయినా పెట్టుబడుదారుల కోసం వెతికితే..కేరళకు చెందిన దనేసా రఘులాల్‌ మాత్రం ఎలాంటి వెంచర్‌ క్యాపిటల్‌ లేకుండా రూ. 822 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన స్ఫూర్తిదాయక కథనం. వటుడింతై అన్నట్లు బ్రెడ్‌, రస్క్‌తో మొదలు పెట్టి వివిధ బేకరి ఉత్పత్తులతో అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిచిన స్టోరీ. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప బిజినెస్‌ పాఠం ఇది.

కస్టమర్‌ కోరుకుంటోంది ఏంటో తెలుసుకుని ఆ దిశగా ఆహర ఉత్పత్తులను అందిస్తే విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించొచ్చని నిరూపించింది ఈ మహిళ. కనీసం ఎలాంటి వెంచర్‌ క్యాపిటల్‌ లేకుండా విజయవంతమైన వ్యాపారం నిర్మించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచింది. అంతేగాదు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించింది. అదికూడా సాధారణ బ్రెడ్‌తో మొదలై..ఏకంగా కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే రేంజ్‌కి వెళ్లడం విశేషం. 

​భారతదేశంలో నాణ్యమైన బ్రెడ్‌ దొరకడం లేదని దాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో మొదలైన వ్యాపారం కేరళకు చెందిన ఎలైట్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమెట్‌. దీన్ని 1986లో స్థాపించారు. కేరళకు చెందిన టి ఆర్‌ రఘులాల్‌ భారత్‌లో అందరూ బ్రెడ్‌ని ఆస్వాదించడం గమనించారు. కానీ అంత నాణ్యవంతంగా లేకపోవడంతో అదే తాను తీసుకురావాలని అనుకున్నారు. అందుకోసం అమెరికాలో సుదీర్ఘకాలం గడిపి తర్వాత భారత్‌లో అందుబాటులో లేని యంత్రాలను దిగుమతి చేసుకుని మరి బ్రెడ్‌ వ్యాపారంలోకి దిగారు. 

మొదట ఆయన బేకరీ బ్రెడ్‌, రస్క్‌లు అందించేది. అలాగే దీనికి సాంకేతికతను కూడా జోడించారు. ఆ తర్వాత ఆయన కుమార్తె దనేసా రఘులాల్‌ దీన్ని మరింత విస్తరించేలా చేశారు. ఆమె బ్రెడ్‌ తయారీకి కావల్సిన పిండి మిల్లుని కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేకులు తయారీలోకి ప్రవేశించి మరింత లాభాల బాట పట్టేలా చేశారు. అలాగే తన తండ్రి వ్యవస్థలు, ప్రక్రియలు సజావుగా సాగితేనే వ్యాపారం విజయవంతమవుతుందనే తన తండ్రి నమ్మకాన్నే తాను విశ్వసిస్తానని అన్నారు. అదే తన బ్రాండ్‌ సక్సెస్‌కి ప్రధాన సీక్రెట్‌ అని నవ్వుతూ చెప్పారామె. 

తాను ఉత్పత్తిని మార్కెటింగ్‌ చేయడంపై దృష్టిపెట్టి మరిన్ని ఆవిష్కరణలు చేసి మరిన్ని ఆహార ఉత్పత్తులు అందించేలా చేశానని చెప్పారు. పండుగలను కేకులతో సెలబ్రేట్‌ చేసుకునేలా తీసుకురావడానికి చాలా కష్టపడ్డానని అన్నారు. అలాగే తమ ఉత్పత్తులు ప్రతి పిల్లవాడికి సురక్షితంగా ఉండేలా కేర్‌ తీసుకున్నామని. అది కూడా తమ బ్రాండ్‌ విజయవంతమవ్వడానికి ప్రధాన కారణమని అన్నారామె. అలాగే తమ ఫుడ్డింగ్‌ కేక్‌ ఎలా కిక్‌ అయ్యిందో కూడా వివరించారు. తాము చేసే ప్లంకేక్‌ కంటే దీనినే రోజు తినడానికి ఆసక్తి చూపిస్తామని చెప్పడంతో మరిన్ని మార్పులు చేసుకొచ్చామని అన్నారు. 

అందుకే పండుగలకు అనుగుణమైన ప్లం కేక్‌లు అందించామని చెప్పుకొచ్చారామె. తాను ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా దనేసా మార్కెటింగ్‌, ఫైనాన్సింగ్‌పై ఎక్కువ దృష్టిపెడతానని అన్నారు. ప్రస్తుతం తమ బ్రాండ్‌ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల తోపాటు మధ్యప్రాచ్యం, యూఎస్‌ఏ, యూకే, యూరప్‌, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్‌, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియాల వరకు తమ బ్రాండ్‌కి మార్కెట్‌ ఉనికి ఉందని చెప్పారు. తమకు భారతదేశం అంతటా తొమ్మిది ఫ్యాక్టరీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఎలైట్‌ బ్రాండ్‌ 150కి పైగా ఉత్పత్తులను విక్రయిస్తూ..ఏడాదికి సుమారు ఫైలింగ్‌ల ప్రకారం, రూ. 822 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ఆర్జిస్తోందని సమాచారం. 

ఇదీ చదవండి: "ఆమె నా కూతురు": తండ్రిగా గర్వించే క్షణం..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement