పుషప్స్‌తో గుండె పదిలం

Doing More Pushups To A Relatively Low Risk Of Heart Disease - Sakshi

లండన్‌ : పుషప్స్‌తో గుండెకు మేలని, రోజుకు 40 పుషప్స్‌ చేసే పురుషులకు గుండె పోటు, స్ర్టోక్‌ ముప్పు 96 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ట్రెడ్‌మిల్‌ టెస్ట్‌లతో పోలిస్తే ఫిట్‌నెస్‌ స్ధాయిలను పరీక్షించేందుకు పుషప్స్‌ మెరుగైన మార్గమని పేర్కొంది. రోజుకు పది నుంచి 40 పుషప్స్‌ చేసే వారిలో దీర్ఘకాలంలో గుండె జబ్బులు, గుండె పోటు అవకాశాలు గణనీయంగా తగ్గాయని తమ పరిశోధనలో వెల్లడైందని హార్వర్డ్‌ వర్సిటీకి చెందిన డాక్టర్‌ జస్టిన్‌ యంగ్‌ పేర్కొన్నారు.

గుండె జబ్బును గుర్తించడంలో రోగి స్వయంగా వెల్లడించే అంశాలతో పాటు, ఆరోగ్య, జీవనశైలి ఆధారంగానే వైద్యులు ఓ అంచనాకు వస్తున్నారని, కార్డియోరెస్పిరేటరీ ఫిట్‌నెస్‌ వంటి కీలక హెల్త్‌ రిస్క్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. పుషప్స్‌ సామర్ధ్యాన్ని సులభంగా, ఎలాంటి వ్యయం లేకుండా పరీక్షించవచ్చని, దీంతో రాబోయే రోజుల్లో వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని అథ్యయన రచయిత స్టెఫాన్స్‌ కేల్స్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 2000 నుంచి నవంబర్‌ 2007 మధ్య దాదాపు వేయి మంది ఫైర్‌ఫైటర్లపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలు గుర్తించామన్నారు. అథ్యయన వివరాలు జామా నెట్‌వర్క్‌ ఓపెన్‌లో ప్రచురితమయ్యాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top