మీలో ఒత్తిడి పెరుగుతోందా...? | Do you get stressed? | Sakshi
Sakshi News home page

మీలో ఒత్తిడి పెరుగుతోందా...?

Jun 25 2017 11:18 PM | Updated on Sep 5 2017 2:27 PM

మీలో ఒత్తిడి పెరుగుతోందా...?

మీలో ఒత్తిడి పెరుగుతోందా...?

పని, మానసిక సమస్యలు కారణం ఏదైనా ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణం అయ్యింది.

సెల్ఫ్‌ చెక్‌

పని, మానసిక సమస్యలు కారణం ఏదైనా ఈ రోజుల్లో ఒత్తిడి సాధారణం అయ్యింది. మ్యూజిక్‌ వినటం, సినిమాలు చూడటంతో కొందరు స్ట్రెస్‌ను తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. కానీ అందరూ అలా చేయలేక అనారోగ్యం పాలవుతుంటారు. స్ట్రెస్‌వల్ల మీరు సిక్‌గా మారారేమో చెక్‌ చేసుకోండి.

1.    రెస్ట్‌ తీసుకొనే సమయం దొరికి నా సరిగా నిద్రపోలేక పోతున్నారు.
ఎ. కాదు     బి. అవును


2.    స్ట్రెస్‌ నుంచి దూరం అవ్వటానికి దురలవాట్లు (మద్యం, ధూమపానం మొదలైనవి) నేర్చుకోవాలనిపిస్తోంది.
ఎ. కాదు     బి. అవును

3.    మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉన్నా మీరు మాత్రం ఎప్పుడూ మూడీగానే ఉంటారు.
ఎ. కాదు     బి. అవును

4.    తరచుగా అలసిపోయినట్లు ఉండటం వల్ల ఏదైనా పనిని మధ్యలోనే వదిలివేయవలసి వస్తోది.
ఎ. కాదు     బి. అవును

5.    కోపాన్ని అణచుకోవటం చాలా కష్టంగా మారింది.
ఎ. కాదు     బి. అవును

6.    ఆందోళనలో ఉన్నప్పుడు గందరగోళానికి గురవుతున్నారు.
ఎ. కాదు     బి. అవును

7.    మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని, మీ శ్రేయోభిలాషుల నుంచి సూచనలు అందుతున్నాయి.
ఎ. కాదు     బి. అవును

8.    ఆహారం మరీ ఎక్కువ లేదా మరీ తక్కువగా తీసుకుంటున్నారు.
ఎ. కాదు     బి. అవును

9.    ఏ పనిమీదా శ్రద్ధ చూపలేకపోతున్నారు.
ఎ. కాదు     బి. అవును

10.    మతిమరుపు వస్తోంది, ఎక్కుసార్లు తలనొప్పితో బాధపడుతున్నారు.
ఎ. కాదు     బి. అవును

‘బి’ సమాధానాలు నాలుగు వస్తే మీరిప్పుడిప్పుడే ఒత్తిడికి గురవుతున్నారు. ఏడు దాటితే మానసికంగా, శారీరకంగా ఇబ్బందుల్లో ఉండి ఉంటారు, వెంటనే ఒత్తిడిని నియంత్రించుకోగలిగే మార్గాలను ఫాలో అవ్వండి. ‘ఎ’ లు ఏడు కంటే ఎక్కువ వస్తే మీలో ఆందోళనకు తావులేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement