కేన్సర్‌ చికిత్సకు కీటో డైట్‌ అండ!

 Diet to treat cancer - Sakshi

ఈ మధ్యకాలంలో విపరీతమైన ప్రచారంలోకి వచ్చిన కీటో డైట్‌ కేన్సర్‌ చికిత్సకు మరింత బలం చేకూర్చగలదని అంటున్నారు కొలంబియా యూనివర్శిటీకి చెంది వెయిల్‌ కార్నెల్‌ మెడిసిన్‌ సంస్థ శాస్త్రవేత్తలు. మన శరీంలో ఇన్సులిన్‌ కారణంగా చైతన్యవంతమయ్యే ఫాస్పాడైలినోసిటోల్‌ –3 (పీఐ3కే) అనే ఎంజైమ్‌లో మార్పులు జరిగితే కేన్సర్లు వచ్చే అవకాశముందని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే రసాయనాల ద్వారా కేన్సర్‌కు చెక్‌ పెట్టాలన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం అయితే ఈ మందుతో అంతగా ఫలితం లేకపోయింది. దీనికి కారణం ఏమిటని పరిశోధించినప్పుడు.. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం మందుపై దుష్ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది.

దీంతో తాము కీటోడైట్‌తో ఇన్సులిన్‌ మోతాదులను తక్కువ స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నించామని.. ఆ పరిస్థితుల్లో పీఐ3కే ఉత్పత్తిని నిలిపివేసే మందులు మెరుగ్గా పనిచేశాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లూయిస్‌ సి కాంట్లీ తెలిపారు. పీఐ3కే ఉత్పత్తిని నియంత్రించే మందులు దాదాపు 20 వరకూ ప్రస్తుతం మానవ ప్రయోగాల దశలో ఉన్నాయని, మందు వాడినప్పుడు కొందరిలో ఇన్సులిన్‌ స్థాయిలు గణనీయంగా పెరిగిపోయాయని వివరించారు. దీంతో వారికి ఆ మందు ఇవ్వడం నిలిపివేయాల్సి వస్తోందని, కీటోడైట్‌తో ఇన్సులిన్‌ను సమర్థంగా నియంత్రించగలిగితే ఈ మందుతో జరిపే కేన్సర్‌ చికిత్స మరింత ప్రభావశీలంగా ఉంటుందన్నది తమ అంచనా అని చెప్పారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top