దేవాలయ వ్యవస్థ

Devotees Visiting The Temple Should Know About The Temple System - Sakshi

ఆలయం ఆగమం

ఆలయాన్ని దర్శించే భక్తులు ఆలయవ్యవస్థ గురించి తెలుసుకోవడం  కనీసధర్మం. అందులో ముందుగా.. ఆలయాన్ని నిర్మించే శిల్పులు, స్థపతుల గురించి తెలుసుకోవాలి. వీరి తోడ్పాటు లేనిదే ఆలయనిర్మాణం అసాధ్యం. విశ్వకర్మ సంప్రదాయ పరంపరలోని వీరు శాస్త్రం, సంప్రదాయం అనుసరించి ఆలయం నిర్మించి.. అందులో విగ్రహం స్థాపిస్తారు. అందుకే వారిని స్థపతి అంటారు.  శిల్పాచార్యులనే పేరుతో కూడా వీరు ప్రసిద్ధులు. భక్తుడు ఆలయానికి చేసే ఒక ప్రదక్షిణ ఫలం శిల్పాచార్యుడికి చేరుతుందని మయుడు చెప్పాడు. ఆలయనిర్మాణం.. ప్రతిష్ఠ జరిగాక ఆలయాభివృద్ధికి తోడ్పడేవారిలో అర్చకులు ముందుంటారు. లోకహితం కోరి అర్చనాది కైంకర్యాలు జరుపుతూ అర్చకుడే దేవుడి ప్రతినిధి అని.. ప్రజలతో మన్ననలందుకునే అర్చకవ్యవస్థను.. అర్చకులను గౌరవించడం భక్తుల విధి. ఇంకా వేదపారాయణదారులు.. శాస్త్రవిద్వాంసులు.. స్థానాచార్యులు... జ్యోతిష విద్వాంసులు.. గాయకులు.. నృత్యకారులు.. వాద్యకారులు...వైద్యులు..అలంకారికులు.. పరిచారకులు మొదలైన ఎందరో ఆలయవ్యవస్థలో భాగస్వామ్యులు.
– కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య
ఆగమ, శిల్పశాస్త్ర పండితులు, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top