తిరుపతిలో నవంబర్‌ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం | Desi seed anniversary of Tirupati November 17-18 | Sakshi
Sakshi News home page

తిరుపతిలో నవంబర్‌ 17–18 తేదీల్లో దేశీ విత్తనోత్సవం

Oct 30 2018 5:35 AM | Updated on Oct 30 2018 5:35 AM

Desi seed anniversary of Tirupati November 17-18 - Sakshi

ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో పుంజుకుంటున్న నేపథ్యంలో రైతులకు అవసరమైన వివిధ రాష్ట్రాలకు చెందిన దేశవాళీ విత్తనాలను అందుబాటులోకి తెచ్చేందుకు తిరుపతిలో నవంబర్‌ 17–18 తేదీల్లో భారీ దేశీయ విత్తనోత్సవం జరగనుంది. సౌత్‌ ఆసియా రూరల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అసోసియేషన్‌(సార) ఈడీ కోడె రోహిణీరెడ్డి, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ప్రమోషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌–సైంటిఫిక్‌ ఎక్స్‌లెన్స్‌(పర్స్‌) సమన్వయకర్త ప్రొ. సాయిగోపాల్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సీడ్‌ ఫెస్టివల్‌లో 14 రాష్ట్రాలకు చెందిన దేశీయ విత్తన సంరక్షకులు 50కి పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారు. సుసంపన్నమైన భారతీయ వ్యవసాయ జీవవైవిధ్యానికి ఈ ప్రదర్శన అద్దం పడుతుందని రోహిణీరెడ్డి తెలిపారు. 500 రకాల దేశీ వరి, 48 రకాల కూరగాయలు, 30 రకాల పప్పుధాన్యాలు, రాజస్థాన్‌ ఆల్వర్‌ నాటు సజ్జలతోపాటు 15 రకాల చిరుధాన్యాల రకాల దేశీ వంగడాలను సైతం రైతులు కొనుగోలు చేయవచ్చన్నారు. దేశీయ విత్తనోత్సవంతోపాటు దేశీ ఆహారోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నామని రోహిణీ రెడ్డి తెలిపారు. వివరాలకు.. 99859 47003, 98496 15634.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement