తడి దుస్తులు వద్దు | Sakshi
Sakshi News home page

తడి దుస్తులు వద్దు

Published Sat, Sep 24 2016 12:11 AM

Dermatology Counseling

డెర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 34 ఏళ్లు. బైక్‌పై ఆఫీసుకు వస్తున్నాను. ఒక్కోసారి తడిగా ఉన్న అండర్‌వేర్‌నే తొడుక్కొని వస్తున్నాను. నడుము కింద చోట చర్మం మడతలు పడే ప్రదేశాల్లో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ దురదగా కూడా ఉంటోంది. ఈ సమస్య నన్ను తరచూ వేధిస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
- నవీన్‌సుందర్, ఏలూరు

మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ కాంబినేషన్ ఉన్న క్రీమును 10 రోజులపాటు ఉదయం, సాయంత్రం రాయాలి. ఆ తర్వాత ప్లెయిన్ టర్బినఫిన్ ఉన్న క్రీము మరో పదిరోజుల పాటు ఉదయం, సాయంత్రం రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. తడి అండర్‌వేర్‌ను ఎప్పుడూ ధరించవద్దు.
- డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్

Advertisement
Advertisement