లెక్క తక్కువైనా...! | Count less... | Sakshi
Sakshi News home page

లెక్క తక్కువైనా...!

Apr 4 2015 11:39 PM | Updated on Apr 3 2019 6:23 PM

లెక్క తక్కువైనా...! - Sakshi

లెక్క తక్కువైనా...!

సూపర్ డెరైక్టర్ మహేష్‌భట్ గారాల కూతురుగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా...

సూపర్ డెరైక్టర్ మహేష్‌భట్ గారాల కూతురుగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా... ఆ తరువాత స్పెషల్ ఇమేజ్‌తో కుర్రకారుకు దగ్గరైపోయింది బొద్దుగుమ్మ అలియాభట్. గత ఏడాది వరుస సినిమాలతో అభిమానుల మనసు కొల్లగొట్టిన ఈ సొగసిరి లెక్క తక్కువైనా పర్లేదు గానీ... ఎక్కువ కాకుండా ఉంటే చాలంటోంది. ఆఫర్లు వస్తున్నాయి కదా అని చేసుకుంటూ పోతే... చివరకు ఫ్యాన్స్ విసుగెత్తిపోతారంది. ఏదైనా ఓ లిమిట్‌లో ఉంటే బాగుంటుందంటోంది.

తన సినిమాల రిలీజ్‌లో కాస్త గ్యాప్ ఇవ్వాలని అభిప్రాయపడుతోంది. ఇక తన తండ్రి మహేష్‌భట్ ప్రొడక్షన్స్‌లో పనిచేసే ప్లాన్స్ ప్రస్తుతానికైతే ఏమీ లేవంది అలియా. ఇటీవల జరిగిన ఫిలింఫేర్ అవార్డుల ఫంక్షన్లో ‘బెస్ట్ ఫిమేల్ యాక్టర్’ (క్రిటిక్స్) గెలుచుకున్న ఈ చబ్బీ చీక్స్ సుందరి మెస్మరైజింగ్ లుక్సే కాదు... ఎనర్జటిక్ యాక్టింగ్‌తో క్రేజీ తారగా మారిపోయింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement