వంటిప్స్ | cooking tips | Sakshi
Sakshi News home page

వంటిప్స్

Jul 3 2016 10:34 PM | Updated on Sep 4 2017 4:03 AM

వంటిప్స్

వంటిప్స్

కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంది.

కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంది.అప్పడాలు వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగదు.మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి.

బంగాళదుంపల మధ్యలో కొన్ని వెల్లుల్లి రేకలు ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.బెండకాయలు తాజాగా, ముదిరిపోకుండా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్‌లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ ఉంటుంది. దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి.

 

 

Advertisement
 
Advertisement
Advertisement