కోకోనట్ ఆయిలా.. మజాకా! | Coconut oil majaka | Sakshi
Sakshi News home page

కోకోనట్ ఆయిలా.. మజాకా!

Aug 10 2015 10:44 PM | Updated on Apr 3 2019 5:44 PM

కోకోనట్ ఆయిలా.. మజాకా! - Sakshi

కోకోనట్ ఆయిలా.. మజాకా!

బాడీ ఆయిల్: నేచురల్ మాయిశ్చరైజర్‌ను మన ఇంట్లోనే పెట్టుకొని సూపర్‌మార్కెట్‌కు పరుగెడుతుంటాం.

 బ్యూటిప్స్

బాడీ ఆయిల్: నేచురల్ మాయిశ్చరైజర్‌ను మన ఇంట్లోనే పెట్టుకొని సూపర్‌మార్కెట్‌కు పరుగెడుతుంటాం. అలా కాకుండా ఇంటి చిట్కా వాడితే అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం. ప్రతిరోజూ స్నానం చేశాక క్రీమీ కొబ్బరి నూనెను చర్మానికి రాసుకోవాలి. దాంతో చర్మం మృదువుగా మారడంతో పాటు నిగనిగలాడుతుంది. అంతేకాకుండా ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా ఎప్పుడూ కాపాడుతుంది.

హెయిర్ మాస్క్: షాంపూతో తలను శుభ్రం చేసుకున్నాక ఆ తడి జుట్టుకు కొబ్బరి నూనె రాయాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో జుట్టును కడిగేసుకోవాలి. దాంతో జుట్టు మెరుస్తూ, మృదువుగా మారుతుంది. ఇలా చేస్తే జుట్టు వదిలేసి రోజంతా బయట తిరిగినా చిక్కు పడకుండా ఉంటుంది.

అధరాలకు అందం: చలికైనా, వేడికైనా చాలామందికి పెదవులు తరచూ పగులుతుంటాయి. అలాంటివారు వాటికి రోజుకు 5-6సార్లు కొబ్బరి నూనె రాసుకుంటే సరి.

పెదాలపై పగుళ్లు త్వరగా తగ్గి మంచి రంగునిస్తాయి. ఆఫీసులకు వెళ్లే వారు ఓ చిన్న అల్యూమినియం టిన్‌లో కానీ వాడేసిన ఐ లెన్స్ హోల్డర్‌లో కానీ కొంచెం కొబ్బరి నూనెను తీసుకెళ్లొచ్చు. పెదవులు ఆరిపోయిన ప్రతిసారి కొద్దిగా నూనెను అధరాలకు రాసుకుంటే మంచి లిప్ బామ్‌గా కూడా పని చేస్తుంది.

సాఫ్ట్ హెయిర్: బయటికి వెళ్లినప్పుడు జుట్టును విరబోసుకుంటే జుట్టుకొసలు చిట్లుతున్నాయా? అలాంటప్పుడు అరచేతిలో రెండు చుక్కల కొబ్బరి నూనె తీసుకొని రెండు చేతులు బాగా రబ్ చేసుకోవాలి. దాంతో ఆయిల్ కొద్దిగా వేడెక్కుతుంది. అప్పుడు ఆ నూనెను జుట్టు అంచులకు రాసుకుంటే స్ల్పిట్ ఎండ్స్ బెడద పోతుంది.

కళ్లకింద క్యారీబ్యాగ్స్ మాయం: కళ్ల కింద క్యారీబ్యాగుల్లా ఉబ్బిపోయి ఉంటే ఎంత అందమైన ముఖమైనా కాంతిని కోల్పోతుంది. ఆ సమస్య నుంచి దూరం కావాలంటే ప్రతి రోజూ నిద్రపోయే ముందు కొద్దిగా కొబ్బరి నూనెను కాటన్‌తో కళ్ల కింద రాసుకొని పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మచ్చలు మాయమవడమే కాకుండా, ఉబ్బిన కళ్లు కూడా అందంగా తయారవుతాయి.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement