
ఎలాంటి చర్మ తత్వం వాళ్లయినా రాత్రి పడుకునేముందు తప్పని సరిగా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం సబ్బును ఉపయోగించకూడదు. సబ్బులో ఉండే గాఢ రసాయనాలు చర్మానికి హాని చేస్తాయి. పదిచుక్కల సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా నువ్వుల నూనెలో రెండు టేబుల్‌స్పూన్ల పాలను కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం పొడిచర్మం గల వారికి బాగా పనిచేస్తుంది. మూడు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో బాగా మగ్గిన అరటిపండు గుజ్జు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా పట్టించి అరగంట తరువాత కడుక్కోవాలి.పుదీనా పేస్ట్‌లో బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమంలో తగినంత వేడినీటిలో కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత కడుక్కోవాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే చర్మకాంతి పెరుగుతుంది. రెండు టీస్పూన్ల పెరుగులో కొద్దిగా బియ్యపు పిండిని కలిపి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట ప్యాక్‌లా వేసుకోవాలి. తర్వాత ఆ ప్రదేశంలో వేళ్లతో వలయాలుగా చుడుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఎక్కువ మసాజ్‌చేస్తే చర్మం ఎర్రగా అయ్యే అవకాశం ఉంది. వారంలో 3 సార్లు ఈ విధంగా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి.