దోమల నిర్మూలనకు కొత్త మార్గం

Chinese scientists New Innovation For Mosquitoes - Sakshi

వ్యాధులను మోసుకొచ్చి అందించే దోమలను నియంత్రించేందుకు చైనా శాస్త్రవేత్తలు మరో కొత్త, వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. చైనాలోని రెండు ప్రాంతాల్లో జరిగిన ప్రయోగాల్లో తాము దోమలను విజయవంతంగా నియంత్రించగలిగామని జార్జ్‌టౌన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు తెలిఆపరు. రేడియోధార్మికతతోపాటు వూల్‌బాకియా అనే బ్యాక్టీరియా రెండింటినీ ఉపయోగించడం ద్వారా తాము ఈ ఘనతను సాధించగలిగామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పీటర్‌ ఆర్మ్‌బ్రస్టర్‌ తెలిపారు. జికా, డేంగీ వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణమైన ఆసియన్‌ టైగర్‌ దోమల నిర్మూలన కోసం తాము ఈ ప్రయోగాలు చేపట్టామని.. రేడియోధార్మికత ద్వారా దోమలు నిస్సంతులుగా మారితే.. వూల్‌బాకియా బ్యాక్టీరియా దోమ గుడ్లను నాశనం చేస్తుందని వివరించారు.

రెండేల్లపాటు తాము గువాంగ్‌ ఝూ ప్రాంతంలోని రెండు ద్వీపాల్లో ఈ పద్ధతులను పరిశీలించి చూశామని చెప్పారు. దోమ గుడ్లలో 94 శాతం ఎదగలేకపోయాయని తెలిపారు. వ్యాధి వ్యాప్తికి కారణమైన ఆడ దోమల సంఖ్య కూడా 83 నుంచి 94 శాతం వరకూ తగ్గిపోయినట్లు తమ పరిశీలనల్లో తేలిందని వివరించారు. మగ దోమలను రేడియోధార్మికత ద్వారా వంధ్యత్వం వచ్చేలా చేయడం.. ఆ దోమలను ప్రకతిలోకి వదలడం ఈ పద్ధతిలో ముఖ్యమైన అంశమని అన్నారు. గతంలోనూ ఈ పద్ధతిని ఉపయోగించినప్పటికీ తాజాగా తాము బ్యాక్టీరియాతో కూడిన దోమలను ఉపయోగించామని.. ఫలితంగా ఆడదోమల గుడ్లు బలహీనంగా మారాయని వివరించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top