యేరుశనగ కోసం మట్టిని దవ్వితే.. | Chandra bose Song on Rangasthalam | Sakshi
Sakshi News home page

యేరుశనగ కోసం మట్టిని దవ్వితే..

Feb 26 2018 12:54 AM | Updated on Feb 26 2018 12:54 AM

Chandra bose Song on Rangasthalam - Sakshi

పదం పలికింది – పాట నిలిచింది
సినిమా పాట ఒక ‘సక్కటి’ కవితైపోవడం అన్నిసార్లూ జరగదు. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్రతిభావంతుడైన గీత రచయిత దాన్ని వదులుకోడు. దానికి, మార్చిలో విడుదల కానున్న ‘రంగస్థలం’ కోసం చంద్రబోస్‌ రాసిన ఈ గీతమే సాక్ష్యం.

యేరుశనగ కోసం మట్టిని దవ్వితే
యేకంగా తగిలిన లంకెబిందెలాగ
ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
సింతాసెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతె
సేతికి అందిన సందమామలాగ / ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె

ఈ పల్లవితో సాగే ఈ పాటలో– ‘రెండు కాళ్ల సినుకువి నువ్వు/ గుండె సెర్లో దూకేసినావు’; ‘సెరుకుముక్క నువ్వు కొరికి తింటావుంటే... సెరుకుగెడకే తీపి రుసి తెలిపినావె’; ‘తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ’; ‘కడవ నువ్వు నడుమున బెట్టి కట్టమీద నడిచొత్తావుంటె సంద్రం నీ సంకెక్కినట్టు’; ‘కట్టెల మోపు తలకెత్తుకోని అడుగులోన అడుగేత్తవుంటే అడవి నీకు గొడుగట్టినట్టు’; ‘బురద సేలో వరి నాటు ఏత్తావుంటె... భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు’ లాంటి చక్కటి వ్యక్తీకరణలున్నాయి. దీనికి సంగీతం, గానం దేవిశ్రీ ప్రసాద్‌. దర్శకుడు సుకుమార్‌. సమంత, రామ్‌చరణ్‌ నాయికానాయకులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement