సెప్టెంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Celebrities celebrate the birthday on September 19 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Sep 19 2015 12:07 AM | Updated on Sep 3 2017 9:35 AM

సెప్టెంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

సెప్టెంబర్ 19న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సం వత్సర సంఖ్య 9.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
లక్కీ అలీ (గాయకుడు);       ఇషా కొప్పికర్ (నటి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది. 9 అంకె పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కొత్త ఆశలు, ఆశయాలతో జీవితం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీరు కోరినవి లభిస్తాయి. అయితే కుజుని ప్రభావం వల్ల దూకుడుగా వ్యవహరించడం, నిర్మొహమాటంగా మాట్లాడటం మూలాన ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది.  

పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలు నడిపేటప్పుడూ, నిప్పుతోనూ అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. పుట్టిన తేదీ 19. దీనివల్ల జీవితంలో పైకి రావాలనే ఆకాంక్ష, క్రమశిక్షణ; నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. మంచి పేరు, గుర్తింపు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం జీవితంలో మైలురాయి వంటిదని చెప్పవచ్చు. కంటిజబ్బులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ముందుగానే తగిన పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, రెడ్, ఆరంజ్; సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, సుదర్శన హోమం చేయించడం, ఇంటిలో ఖురాన్ పఠన చేయించడం లేదా ప్రేయర్ పెట్టించడం, రక్తదానం చేయడం, తల్లిని, తోబుట్టువులను ఆదరించడం, అనాథలకు మందులు పంపిణీ చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్

Advertisement
 
Advertisement
Advertisement