బోయింగ్‌ విమానం... హైపర్‌ స్పీడ్‌! | Boeing aircraft hyper speed | Sakshi
Sakshi News home page

బోయింగ్‌ విమానం... హైపర్‌ స్పీడ్‌!

Feb 7 2018 12:35 AM | Updated on Feb 7 2018 12:35 AM

Boeing aircraft hyper speed - Sakshi

బోయింగ్‌ విమానం

బోయింగ్‌ ఓ కొత్త విమానాన్ని అభివృద్ధి  చేసింది. విమానాల కంపెనీ అవి కాకుండా ఇంకేం తయారు చేస్తుంది! అని ప్రశ్నిస్తున్నారా... కొంచెం ఆగండి.. ఈ కొత్త విమానం వివరాలు తెలిస్తే.. మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఈ కొత్త విమానం ప్రయాణించే వేగం అక్షరాలా గంటకు 3836 మైళ్లు! కిలోమీటర్లలో చెప్పాలంటే ఇది ఒక్క గంట ఎగిరితే హైదరాబాద్‌ నుంచి యూరప్‌లోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళ్లిపోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ విమానం మూడంటే మూడు గంటల్లో భూమిని చుట్టేయగలదు.

అతివేగం ప్రమాదకరం కాదా? అంటే.. అబ్బే! ఇది ప్రయాణికుల కోసం కాదులెండి... అంటోంది బోయింగ్‌. భూమి మీద ఏ మూల నుంచైనా ముప్పు ఉందన్న అనుమానం వస్తే నిమిషాల్లో వాలిపోయేందుకు, జవాబు చెప్పేందుకు మిలటరీ వర్గాలకు ఇలాంటి విమానం అవసరం అంటోంది. ‘సన్‌ ఆఫ్‌ బ్లాక్‌ బర్డ్‌’ అని పిలుస్తున్న బోయింగ్‌ కొత్త విమానం ఇప్పటివరకూ ప్రపంచంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించేదిగా పేరు పొందిన కంకార్డ్‌ కంటే రెట్టింపు వేగంతో వెళుతుంది. బోయింగ్‌కు పోటీగా లాక్‌హీడ్‌ మార్టిన్‌ అనే సంస్థ కూడా ఇలాంటి సూపర్‌ స్పీడ్‌ విహంగాల తయారీకి ప్రయత్నిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement