బ్యూటిప్స్ | Body Hair Treatment | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్

Oct 17 2016 10:58 PM | Updated on Apr 3 2019 5:44 PM

బ్యూటిప్స్ - Sakshi

బ్యూటిప్స్

గులాబీ రెక్కలు - 5 నిమ్మరసం - 5 చుక్కలు శనగపిండి - 2 టీ స్పూన్లు ఛాయపసుపు - చిటికెడు పై పదార్థాలకి కొంత నీటిని చేర్చి

రోజ్ క్రీమ్ 
గులాబీ రెక్కలు - 5 నిమ్మరసం - 5 చుక్కలు శనగపిండి - 2 టీ స్పూన్లు  ఛాయపసుపు - చిటికెడు  పై పదార్థాలకి కొంత నీటిని చేర్చి పేస్ట్ చేయాలి. ముఖాన్ని శుభ్రపరిచి ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని పాలతో శుభ్రపరచాలి. ఆ తరువాత నీటితో కడిగేయాలి. 15 రోజులకి ఒకసారి ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం నునుపు అవ్వడమే కాకుండా మొటిమలు, నల్లమచ్చలు కూడా మటుమాయం అవుతాయి.

 

సూపర్ బాడీ హెయిర్ ట్రీట్‌మెంట్
రెండు టేబుల్ స్పూన్ల మొలాసిస్, రెండు టేబుల్ స్పూన్ల జిలటిన్, ఒక టేబుల్ స్పూన్ కండెన్స్‌డ్ మిల్క్, ఒక టేబుల్ స్పూన్ బీర్ తీసుకుని అన్నింటినీ ఒక కప్పులో వేసి బాగా కలపాలి. దువ్వెనతో కాని హెయిర్ బ్రష్‌తో కాని జుట్టంతటికీ పట్టించి తలకు పాలిథిన్ కవర్ కాని షవర్ క్యాప్ కాని పెట్టి అరగంట సేపు అలాగే ఉంచాలి. తరువాత వేడినీటితో శుభ్రం చేసి చివరగా తలస్నానం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement