పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 30 2015 11:10 PM | Updated on Aug 17 2018 7:32 PM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు - Sakshi

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: ఎ.కోదండరామ్‌రెడ్డి (దర్శకుడు) అఖిలేష్ యాదవ్ (యు.పి. ముఖ్యమంత్రి)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతుగ్రహానికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందుతారు. నాస్తికులు కూడా ఆధ్యాత్మిక చింతనతో దేవాలయాలు, అనాథాశ్రమాలకు విరాళాలు ఇచ్చి తమ ఉదారతను చాటుకుంటారు. మీ డేటాఫ్ బర్త్‌లో 7 ఉన్నందువల్ల తాంత్రిక విద్యలపై ఆసక్తి, వైద్యవృత్తిపై ఆపేక్ష పెంచుకుంటారు. గొప్ప, మానసిక, ఆధ్యాత్మిక పరిణతిని సాధిస్తారు. విద్య, ఉద్యోగాల పరంగా విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. వీరి మనసు ఆశ, నిరాశల మధ్య ఊగిసలాడుతుంది. అందువల్ల సానుకూలధోరణిలో ఉండే ఆలోచనలు పెంచుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టడం మంచిది కాదు. ఆధ్యాత్మికతలో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్ల సంసార జీవితంలో కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది.

గురువులు, పీఠాధిపతులు, జ్యోతిష్యరంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వైద్యవృత్తిలో ఉన్న వారికి విదే శాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. లక్కీ నంబర్స్: 1,6,2,7; లక్కీ డేస్: ఆది, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, గోల్డెన్; సూచనలు: ఈ సంవత్సరం వీరు ఓర్పు, సహనం, ఆశావహ దృక్పథంతో వ్యవహరించడం మంచిది. అనాథలకు అన్నదానం చేయడం, వేదపాఠశాలలకు, మదరసాలకు, మిషనరీస్‌కు ఆర్థిక సాయం అందించడం, సూర్యారాధన, కేతుజపం కలిసి వస్తాయి.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement