పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు

Jun 28 2015 10:58 PM | Updated on Sep 3 2017 4:32 AM

పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు

పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7...

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపు కుంటున్న ప్రముఖులు: కార్తిక్ రాజా (మ్యూజిక్ కంపోజర్), నికోల్ షెర్జింజర్(అమెరికన్ పాప్ గాయని)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఇది కేతు సంబంధమైన సంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు ఆధ్యాత్మిక తపై మొగ్గు చూపుతారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. విద్యార్థులకు విదేశాలలో చదువు కోవాలనే కోరిక, ఉద్యోగులకు విదేశాలలో ఉద్యోగం చేయాలనే కోరిక తీరతాయి. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి తగ్గడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యతలోపించవచ్చు. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. పండితులు, జ్యోతిష్యులకు గుర్తింపు వస్తుంది. వైద్య విద్యార్థులకు, వైద్యులకు బాగా పేరు వస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భూమిని, ఇంటిని అమ్మాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువులను, స్నేహితులను కలుస్తారు. లక్కీ నంబర్స్: 1,2,6,7; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గోల్డెన్, గ్రే, శాండల్ , బ్లూ; లక్కీ డేస్: ఆది, సోమ, శుక్రవారాలు సూచనలు: కేతు జపం చేయించు కోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, పండితులను, గురువులను గౌరవించడం, వికలాంగులను ఆదరించడం మంచిది.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు.

Advertisement
 
Advertisement
Advertisement