పొడి చర్మానికి హాట్‌ థెరపీ | beauty tips | Sakshi
Sakshi News home page

పొడి చర్మానికి హాట్‌ థెరపీ

Oct 11 2017 11:49 PM | Updated on Oct 11 2017 11:49 PM

 beauty tips

పొడిచర్మాన్ని రోజూ పదినిమిషాల సేపు హాట్‌థెరపీతో స్వాంతన పరచాలి. అదెలాగంటే... గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్‌థెరపీ. ఉదయం స్నానం చేయడానికి ముందు కానీ రాత్రి పడుకునే ముందు కానీ చేయవచ్చు.ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్‌ కమలారసం, ఒక టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. పొడిచర్మానికి ఈ ప్యాక్‌ మంచి ఫలితాన్నిస్తుంది.బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది, మెడనల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపును వదులుతుంది.

పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్‌సీడ్‌ ఆయిల్‌ బాగా పని చేస్తుంది. దేనితోనూ కలపాల్సిన అవసరం లేకుండా ఆయిల్‌ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది.ఇది సౌందర్యసాధనాల మార్కెట్‌లో దొరుకుతోంది.పొడిచర్మం తీవ్రంగా బాధిస్తున్నప్పుడు అనేక రకాల కాంబినేషన్‌లతో ప్యాక్‌లు తయారు చేసుకోవడానికి సాధ్యం కానప్పుడు  సింపుల్‌గా ఓ చిట్కా. స్వచ్ఛమైన ఆముదం లేదా అవొకాడో ఆయిల్‌  రాయాలి. అదీ కాకపోతే బాదం నూనె లేదా నెయ్యి రాయాలి.

Advertisement
 
Advertisement
Advertisement