చక్కెర కేలరీలతో చిక్కే

Any calories, too much food, obesity, such as diabetes  - Sakshi

ఆహారం ఏదైనా కేలరీలు ఎక్కువైతే ఊబకాయం, మధుమేహం వంటివి వచ్చేస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే చక్కెరతో కూడిన పానీయాలతో శరీరానికి చేరే కేలరీలతో సమస్య మరింత ఎక్కువ అవుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒబేసిటీ రివ్యూస్‌ జర్నల్‌లో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఆహారం, ఆరోగ్యంపై ప్రభావం అనే అంశంపై ఇప్పటికే జరిగిన దాదాపు 22 పరిశోధనల ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు కింబర్‌ స్టాన్‌హోప్‌ తెలిపారు.

చక్కెర బదులుగా వాడే ఆస్పర్‌టైమ్‌ వంటి కృత్రిమ పదార్థాలతో బరువు పెరుగుతారన్నది అపోహ అని స్టాన్‌హోప్‌ అంటున్నారు. ఈ విషయం అందరి ఆలోచనల కంటే భిన్నంగా ఉన్నప్పటికీ పరిశోధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని వివరించారు. కొన్ని రకాల నూనెలు, విత్తనాలు, గింజల్లో ఉండే పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు సంతృప్త కొవ్వులతో పోలిస్తే మేలైనవని అన్నారు. అయితే పాల ఉత్పత్తులో ఉండే సంతృప్త కొవ్వులతో పెద్దగా ఇబ్బందేమీ లేదని స్పష్టం చేశారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top