నిన్నటి చిన్నపిల్ల ఖాన్ గారి అమ్మాయి! | Aamir Khan's daughter Ira steals the show at his Diwali party | Sakshi
Sakshi News home page

నిన్నటి చిన్నపిల్ల ఖాన్ గారి అమ్మాయి!

Nov 5 2013 11:28 PM | Updated on Sep 2 2017 12:18 AM

నిన్నటి చిన్నపిల్ల ఖాన్ గారి అమ్మాయి!

నిన్నటి చిన్నపిల్ల ఖాన్ గారి అమ్మాయి!

ఆమిర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌రావ్ ముంబైలో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన దీపావళి పార్టీ...

 ఆమిర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్‌రావ్ ముంబైలో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన దీపావళి పార్టీ... ఇరా ఖాన్ రాకతో మరింత దేదీప్యమానం అయింది! ఆకుపచ్చని చీరలో, చేతికి గాజులు వేసుకుని సంప్రదాయపు చిరునవ్వుతో తన తండ్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇరాఖాన్‌ను, అప్పటికే పార్టీలో కాంతులను విరజిమ్ముతున్న ‘ఎ’లిస్ట్ తారలంతా తలలు తిప్పి చూడడం ఆమె తల్లి రీమా దత్ హృదయాన్ని ఉప్పొంగించే సంగతే కానీ, ఆ పార్టీలో ఆమె ఎక్కడా దర్శనమివ్వలేదు. రీమా, ఆమిర్ మొదటి భార్య. 1986 ఏప్రిల్‌లో వీరి పెళ్లి జరిగింది.
 
 పదిహేనేళ్ల తర్వాత 2002 డిసెంబరులో విడిపోయారు. అప్పట్నుంచీ ఇరా, ఆమె సోదరుడు తల్లితోనే ఉంటున్నారు. ప్రతి దీపావళికీ ఇరా తన తండ్రి ఇచ్చే పార్టీకి బాలీవుడ్‌లోని ఇతర ప్రముఖలతో పాటు ఒక అతిథిగా హాజరువుతూనే ఉంటుంది. అయితే ఈసారి ఆమె తన పదహారవ యేట ఒక పరిపూర్ణమైన స్త్రీగా ప్రత్యక్షం అవడం అందరినీ ముగ్ధులను చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement