చివరి రౌండ్లో జలీల్ ఖాన్ విజయం | ysr congress party condidate jalil khan win in vijayawada west | Sakshi
Sakshi News home page

చివరి రౌండ్లో జలీల్ ఖాన్ విజయం

May 16 2014 7:25 PM | Updated on Aug 10 2018 8:06 PM

చివరి రౌండ్లో జలీల్ ఖాన్ విజయం - Sakshi

చివరి రౌండ్లో జలీల్ ఖాన్ విజయం

కృష్ణాజిల్లాలోని 16 నియోజకవర్గాల్లో అయిదు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

హైదరాబాద్ : కృష్ణాజిల్లాలోని 16 నియోజకవర్గాల్లో అయిదు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. విజయవాడ వెస్ట్, నూజివీడు, గుడివాడ, పామర్రు, తిరువూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నూజివీడు- మేకా ప్రతాప్ అప్పారావు, గుడివాడ-కొడాలి నాని, పామర్రు-ఉప్పులేటి కల్పన, విజయవాడ వెస్ట్-జలీల్ ఖాన్ గెలుపొందారు. కాగా విజయవాడ వెస్ట్  స్థానానికి హోరాహోరీగా జరిగిన పోరులో చివరి రౌండ్లో  జలీల్ ఖాన్  రెండువేల మెజార్టీతో గెలుపొందారు.

ఇక గన్నవరం, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ సెంట్రల్,విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, అసెంబ్లీ స్థానాల్లో సైకిల్ హవా కొనసాగింది. అలాగే కృష్ణాజిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను టీడీపీ సొంతం చేసుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement