టీఆర్ఎస్ వీడనున్న ఇబ్రహీం? | TRS leader Syed Ibrahim to quit TRS? | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ వీడనున్న ఇబ్రహీం?

Mar 28 2014 12:15 PM | Updated on Mar 18 2019 9:02 PM

టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం ఆపార్టీని వీడనున్నట్లు సమాచారం.

హైదరాబాద్ : టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు సయ్యద్ ఇబ్రహీం ఆపార్టీని వీడనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు మంతనాలు జరుపుతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇబ్రహీం శుక్రవారం మధ్యాహ్నం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.

కాగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ నుండి టిఆర్‌ఎస్ టికెట్‌ను ఆశిస్తున్న ఇబ్రహీంకు బదులుగా టిజెఎసి రాష్ట్ర కోకన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్‌కు ఈ నియోజకవర్గం నుండి తెరాస టికెట్‌ను కెసిఆర్ ప్రకటించడంతో ఇబ్రహీం కంగుతిన్నారు. దాంతో  భవిష్యత్తు రాజకీయాలపై ఆయన దృష్టి సారిస్తూ కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.  మాజీ మంత్రి డికె అరుణతో ఇబ్రహీం  సంప్రదింపులు కొనసాగిస్తునట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.కాగా గతంలో మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆయన రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement