టీఆర్‌ఎస్‌లో చేరిన బాజిరెడ్డి, చంద్రావతి | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన బాజిరెడ్డి, చంద్రావతి

Published Sat, Apr 5 2014 1:55 AM

టీఆర్‌ఎస్‌లో చేరిన  బాజిరెడ్డి, చంద్రావతి - Sakshi

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంకా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ సుస్థిర ప్రభుత్వాలు రాకుండా ఆంధ్రా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

ఈ కుట్రలను ఎదుర్కోవడానికి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. చంద్రబాబుకు తెలంగాణలో ఓట్లు పడవని తెలుసుకుని, మోడీ జపంతో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ‘నేను విజయవాడలో పోటీ చేస్తే...ఆంధ్రోళ్లు ఓట్లు వేస్తారా’ ? అని ప్రశ్నించారు. అందుకే ఇక్కడ ఆంధ్రోళ్ల పార్టీకి ఓట్లు వేయవద్దని అన్నారు. వైరా ఎమ్మెల్యే చంద్రావతి, నిర్మల్‌కు చెందిన ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీలో చేరారు.
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement