రేపు షర్మిల పర్యటన | Tomorrow sharmila tour at Kurnool | Sakshi
Sakshi News home page

రేపు షర్మిల పర్యటన

Apr 21 2014 11:44 PM | Updated on Aug 30 2018 4:51 PM

రేపు షర్మిల పర్యటన - Sakshi

రేపు షర్మిల పర్యటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బుధవారం (23న) జిల్లాలో పర్యటించనున్నారు.

కర్నూలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల బుధవారం (23న) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆమె పర్యటించనున్నారు.

 

23వ తేదీ ఉదయం 10 గంటలకు కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్‌లో రోడ్‌షో, జనభేరి సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరు చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అక్కడి నుంచి రాత్రి 7 గంటలకు నంద్యాల చేరుకుని రోడ్‌షో నిర్వహించి జనభేరి సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని గౌరు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement